బిడ్డొచ్చిన వేళ 5 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కొన్న హీరో
రణవీర్ సింగ్- దీపికా పదుకొణె ప్రస్తుతం పేరెంట్‌హుడ్ తో కొత్త దశను అనుభవిస్తున్నారు.
రణవీర్ సింగ్- దీపికా పదుకొణె ప్రస్తుతం పేరెంట్‌హుడ్ తో కొత్త దశను అనుభవిస్తున్నారు. 2024 సెప్టెంబరు 8న ముంబయిలో తమ మొదటి బిడ్డగా, అందమైన ఆడ శిశువుకు వీరిద్దరూ స్వాగతం పలికారు. కుమార్తె పుట్టినప్పటి నుండి ఈ జంట లోప్రొఫైల్ లో జీవిస్తూ ఆరుబయట అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు బిడ్డొచ్చిన వేళ కొత్త కార్ కూడా వచ్చింది ఆ ఇంటికి.
ఇటీవల వెబ్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కొత్త రేంజ్ రోవర్ 4.4 LWB తో రణవీర్ కనిపించారు. దీని విలువ రూ. 4.74 కోట్లుగా అంచనా. ఇది 6969 అనే వ్యక్తిగతీకరించిన నంబర్ ప్లేట్‌ను కలిగి ఉంది. రణ్ వీర్ వద్ద ఉన్న ఇతర కార్ల తరహాలోనే ప్రత్యేకమైన ప్లేట్ తో డిజైన్ చేసినది. అయితే ఆడబిడ్డ రాకను పురస్కరించుకుని కొత్త కారు ప్రత్యేకంగా కొనుగోలు చేశారా? అంటూ నెటిజనులు ప్రశ్నస్తున్నారు. రణవీర్ - దీపిక ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఇటలీలోని లేక్ కోమోలో 14 నవంబర్ 2018న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం `సింగం ఎగైన్`లో ఈ జంట కలిసి నటించారు. నవంబర్ 1న థియేట్రికల్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ఫ్రాంచైజీకి చెందిన మొదటి మహిళా పోలీసు శక్తి శెట్టిగా దీపిక నటించింది.
మరోవైపు దీపిక తన నిజ జీవితంలో తల్లి పాత్రకు ప్రాధాన్యతనిస్తూ మార్చి 2025 వరకు ప్రసూతి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. రణవీర్ నవంబర్ నుంచి ఆదిత్య ధర్ ప్రాజెక్ట్ కోసం చిత్రీకరణను తిరిగి ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం 2025 ద్వితీయార్థంలో విడుదల కానుంది.