కల్కి : సుమతి శ్రీవారి ప్రశంసలు!

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా కల్కి ముచ్చట్లు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి.

Update: 2024-07-03 06:29 GMT

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా కల్కి ముచ్చట్లు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బ్రేక్ ఈవెన్‌ కలెక్షన్స్ ను సాధించిన కల్కి సినిమా రాబోయే వీకెండ్‌ లో మరింతగా బాక్సాఫీస్ హడావిడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా స్థాయి పెంచే విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రముఖులు కల్కి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు కల్కి సినిమాను చూసిన రణ్‌వీర్ సింగ్ వంతు వచ్చింది. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి కల్కి సినిమాను చూసిన రణ్‌వీర్ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు.

కల్కి సినిమాలో ముఖ్య పాత్ర సుమతి గా నటించిన దీపికా పదుకునే భర్త అయిన రణ్‌వీర్‌ సింగ్‌ ఇన్‌స్టాలో షేర్ చేసిన రివ్యూ అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌ అయ్యింది. కల్కి గురించి కాస్త ఆలస్యంగా అయినా రణ్‌వీర్ సింగ్ స్పందించినందుకు సంతోషంగా ఉందంటూ ప్రభాస్ మరియు దీపికా ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాలో రణ్‌వీర్‌ సింగ్‌... కల్కి సినిమా ఒక మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌. బిగ్‌ స్క్రీన్‌ లో చూసి ఆనందించదగ్గ సినిమా. టెక్నికల్‌ గా దర్శకుడు ఈ సినిమాను చూపించిన తీరు బాగుంది. ఇండియన్‌ సినిమాలో బెస్ట్‌ మూవీగా కల్కి నిలుస్తుంది. నాగ్‌ అశ్విన్ అండ్ టీమ్ కి శుభాకాంక్షలు.

ప్రభాస్ మరియు కమల్‌ హాసన్‌ ల నటన బాగుంది. ఇక మీరు అమితాబ్‌ సర్ అభిమాని అయితే తప్పకుండా కల్కి చూడాల్సిందే. ఇక నా బేబీ దీపికా పదుకునే నటన చాలా బాగుంది. సీరియస్ పాత్ర లో నిన్ను నువ్వు చూపించిన తీరు సూపర్ అంటూ సుమతి పాత్ర పోషించిన దీపికా కి శ్రీవారు రణ్‌వీర్ సింగ్‌ ప్రశంసలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News

eac