రాశి ఖన్నా కెరీర్ ఓకే కానీ
ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న బ్యూటీ రాశిఖన్నా. ఈ అమ్మడు చేతిలో అవకాశాలు బాగానే ఉన్న స్ట్రైట్ తెలుగు మూవీలో కనిపించి చాలా కాలం అయ్యింది. చివరిగా రాశిఖన్నా నాగ చైతన్య థాంక్యూ మూవీలో నటించింది. ఈ ఏడాది అరణ్మనై 4 సినిమాతో రాశిఖన్నా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఏకంగా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆరంభంలో యావరేజ్ టాక్ వచ్చిన కూడా తరువాత మెల్లగా కలెక్షన్స్ పుంజుకున్నాయి. లాంగ్ రన్ లో ఈ చిత్రం సెంచరీ క్రాస్ చేసింది. సుందర్ సికి జోడీగా ఈ చిత్రంలో రాశిఖన్నా నటించింది. అరణ్మనై ఫ్రాంచైజ్ లో 4వ భాగంగా ఈ మూవీ వచ్చింది. తెలుగులో బాక్ టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.
వాటిలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుసుకదా మూవీ ఒకటి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రాశిఖన్నా చాలా హోప్స్ పెట్టుకుంది. ఓ విధంగా టాలీవుడ్ లో రాశిఖన్నా ఫేడ్ అవుట్ అయిపొయిందనే విధంగా కామెంట్స్ వచ్చాయి. కొత్త కొత్త భామలు వస్తూ ఉండటంతో ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయని కథనాలు వచ్చాయి. కాబట్టి ఆమె విమర్శలకు చెక్ పెట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే మరోసారి సుందర్ సి దర్శకత్వంలో ఆయనకి జోడీగా నటించడానికి రాశిఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇప్పటికే అరణ్మనై 3, 4 పార్ట్స్ లో రాశిఖన్నా హీరోయిన్ గా చేసింది.
మూడో సారి సుందరి సితో జతకడుతోంది. అయితే ఇది అరణ్మనై నెక్స్ట్ పార్ట్ కోసం కాదని తెలుస్తోంది. ఓ కొత్త కథతో సుందర్ సి హీరోగా స్వీయ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడంట. ఈ సినిమా కోసం రాశిఖన్నాని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారంట. రాశిఖన్నా నటించిన హిందీ సినిమాలు ది సబర్మతి రిపోర్ట్, TME పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అలాగే తమిళంలో మేథావి అనే మరో సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.
ఈమె తెలుగు మూవీ తెలుసుకదా ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కావొచ్చంట. అయితే రాశిఖన్నా సినిమాల లైన్ అప్ చూసుకుంటే మేగ్జిమమ్ చిన్న హీరోలతోనే ఉన్నాయి. మరి ఈ బ్యూటీ స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాన్ని మళ్ళీ అందుకుంటుందా లేదంటే ఇక కంటెంట్ బేస్డ్ కథలు, చిన్న, మీడియం రేంజ్ హీరోలతో చేసుకోవాల్సిందేనా? అనే సందేహాలు వస్తున్నాయి. మరి ఈ బ్యూటి స్టార్ హీరోలతో ఛాన్స్ లు ఇంకెప్పుడు అందుకుంటుందో చూడాలి.