శ్రీవల్లి అంటే శ్రీవల్లి అనిపించుకుందిగా..!

నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తున్న రష్మిక యానిమల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టగా లేటెస్ట్ గా పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-12-05 16:02 GMT

మాస్ అండ్ కమర్షియల్ సినిమాల్లో కథానాయికలు కేవలం సాంగ్స్ కి మాత్రమే అనట్టుగా కొన్ని సినిమాలు వస్తాయి. కానీ కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం అది ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయ్యుండి పాన్ ఇండియా రిలీజైనా కూడా అదిరిపోయే పాత్ర అవుతుంది. సరైన స్కోప్ వస్తే తమ టాలెంట్ చూపించే హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్నారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తున్న రష్మిక యానిమల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టగా లేటెస్ట్ గా పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర కూడా హైలెట్ గా నిలిచింది. పార్ట్ 1లో కేవలం కొన్ని సీన్స్ కే పరిమితం కాగా పార్ట్ 2 లో మాత్రం రష్మిక వేరే లెవెల్ అనిపించేలా చేసింది. సినిమా మొత్తం ఉన్నా కూడా అందులో 3 సీన్స్ లో అదరగొట్టేసింది. ముఖ్యంగా తన భర్త పుష్ప రాజ్ ని తక్కువ చేసి మాట్లాడే టైం లో అతనికి సపోర్ట్ గా సూపర్ డైలాగ్స్ తో అదరగొట్టేసింది రష్మిక.

పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ కి అంతమంచి స్క్రీన్ స్పేస్ అది కూడా ఆమె ఒక్కతే మాట్లాడేలా సీన్ పడటం లక్కీ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ రష్మిక జోడీ సినిమాకు హైలెట్ కాగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. రష్మిక కూడా వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంది. పుష్ప 2 సినిమా చూసిన వారెవరైనా శ్రీవల్లి అంటే శ్రీవల్లి అనిపించేసింది.

యానిమల్ తో పాటు పుష్ప 2 తో నేషనల్ వైడ్ గా రష్మికకు మరింత క్రేజ్ రానుంది. తప్పకుండా రాబోతున్న సినిమాలతో రష్మిక కూడా తన స్టెల్లర్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించేలా చేస్తుంది. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికిందర్ సినిమాల్లో నటిస్తుంది. పుష్ప 2 తోనే కాదు పుష 3 ర్యాంపేజ్ కూడా ఉంటుంది. సో మళ్లీ రష్మిక పుష్ప 3 లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. రష్మిక ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఏర్పడుతుంది. రాబోతున్న సినిమాలు కూడా రష్మిక కెరీర్ మరింత దూకుడిగా మారుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News