బన్నీ విషయం.. నమ్మలేకపోతున్నానంటూ రష్మిక పోస్ట్!

తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న.. బన్నీ అరెస్ట్ పై రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను నమ్మలేకపోతున్నట్లు తెలిపారు.

Update: 2024-12-13 14:12 GMT

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. బన్నీకి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ను మంజూరు చేసింది.

అప్పటికే నాంపల్లి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో చంచల్‌ గూడ జైలు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చేయనున్నారు.

అయితే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై అనేక మంది సినీ ప్రముఖుల స్పందిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై ఒకరినే నిందించడం సరికాదని హితవు పలుకుతున్నారు. బన్నీ అరెస్ట్ విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న.. బన్నీ అరెస్ట్ పై రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. దురదృష్టకరమని చెప్పారు. తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

అయితే అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన పుష్ప-2 సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా.. కొన్ని ప్రాంతాల్లో 4వ తేదీన రాత్రి 9.30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ లో కూడా వేశారు.

అక్కడి షోకు అల్లు అర్జున్ కూడా సినిమా చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు ఫ్యాన్స్, ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అప్పుడు రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News