సుకుమార్.. బౌండ్ స్క్రిప్ట్‌తో పనిచేసే డైరెక్టర్ కాదు: రష్మిక

ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న.. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

Update: 2024-12-12 10:30 GMT

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న.. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సుకుమార్ ను ప్రశంసిస్తూ.. ఆయన బౌండ్ స్క్రిప్ట్‌తో వర్క్ చేసే డైరెక్టర్ కాదని, సెట్స్‌కి వెళ్లినప్పుడు అప్పటికప్పుడు విషయాలను గుర్తిస్తారని తెలిపింది.

''పుష్ప 2'' సినిమాలో జాతర ఎపిసోడ్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనతో పాటుగా, అతని భార్య శ్రీవల్లిగా రష్మిక మందన్న పెర్ఫార్మన్స్ కి కూడా ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ సీన్ లో శ్రీవల్లి తన బావపై కోపంగా ఎమోషనల్ గా మాట్లాడుతూ తనలోని అగ్రెసివ్ నెస్ ని చూపిస్తుంది. వెంటనే తన ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసి 'రా సామీ' అంటూ పుష్పపై తనలోని కేరింగ్ సైడ్ ని చూపిస్తుంది. దాదాపు మూడు నాలుగు నిముషాలు ఉండే ఈ సన్నివేశంలో రష్మిక ఒక విధంగా ఏకపాత్రాభినయం చేసి అందరిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. అలాంటి కీలకమైన సీక్వెన్స్ షూట్ చేసేప్పుడు సెట్స్ లో ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయనేది రష్మిక వివరించింది.

''నాకు గుర్తుంది నేను 'పుష్ప-2' షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే, డైరెక్టర్ సుకుమార్ వచ్చి నాకు శ్రీవల్లి పాత్ర ఆర్క్ గురించి చెప్పారు. ఆమెకు సినిమాలో ఒక హై మూమెంట్ ఉంటుందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను.. కానీ నువ్వు మాత్రం మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. నాకు దాని కోసం చాలా క్యూరియస్ గా ఎదురు చూసాను. మూవీలో 20 - 21 నిమిషాలు ఉండే జాతర సీక్వెన్స్ షూటింగ్ మొత్తం 3 - 4 నెలల పాటు జరిగింది. సుకుమార్ బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చే వ్యక్తి కాదు.. అతను ప్రతీది సినిమా షూట్ జరిగే క్రమంలో రాసుకుంటూ వస్తారు. ఆ సీన్ షూట్ చేసే రోజు వచ్చినప్పుడు, అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత సడన్ గా నాకు 3-4 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. చూస్తే.. దాంట్లో నేను ఒక్కదాన్నే మాట్లాడే లైన్స్ ఉన్నాయి''

''నేను మామూలుగా ఇంటరాక్టివ్ యాక్టర్ ని. ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కోస్టార్ చెప్పే డైలాగ్స్ ని బట్టి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనే దాన్ని బట్టి.. నేను రియాక్ట్ అయి డైలాగ్స్ చెబుతుంటాను. కానీ 'పుష్ప 2'లో ఆ సీన్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవరూ మాట్లాడటం లేదు. ఆమె ఒక్కతే చెబుతూ పోతోంది. 'పుష్ప' పార్ట్-1లో శ్రీవల్లి బావ ఇంటి పేరు.. ఇంటి పేరు అంటూ పుష్పరాజ్ ని ఇరిటేట్ చేస్తుంటాడు. కాబట్టి ఈ మూమెంట్ లో నేను అతని కోసం నిలబడాలి.. అది ప్రజలు పూర్తిగా నమ్మేలా ఉండాలి. ఆమె ఆ సమయంలో ప్రగ్నెంట్, అలసిపోయినట్లు కనిపించాలి. పక్కనే ఉన్న అమ్మ సైలెంట్ గా ఉండమని అంటే.. నీకేం తెలుసు నోరు మూసుకోమని చెప్పాలి. అలానే 'నీ కొడుకుని అంటే నువ్వు గమ్ముగా ఉంటావేమో, ఎవరైనా నా మొగుడిని అంటే మాత్రం నేను సైలెంట్ గా ఉండను' అంటూ అత్తని వారించాలి''

''ఏ మహిళ అయినా తన భర్తను ఎవరేమన్నా ఊరుకోదు. తన భర్త ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే తన భాగస్వామిని దైవంగా భావిస్తుంది. ఆ విధంగానే జాతర సీన్ లో ఒక పక్క కోపం చూపిస్తూ ఏడుస్తూనే, మరో పక్క పుష్ప మీద ప్రేమను చూపించాలి. సో నేను ఆ సీన్ లో ఇంపాక్ట్ చూపించాలని అనుకున్నాను. జనాలు నన్ను ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అంటుంటారు కాబట్టి, నేను దాన్ని ఉపయోగించాలి కదా(నవ్వుతూ). ఆ 3-4 నిమిషాల్లోనే కోపం, బాధ, నవ్వు, ప్రేమ.. ఇలా అన్ని భావోద్వేగాలు చూపించాలి. అందుకే ఇప్పుడు ఆ సన్నివేశాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సీన్ చేసే అవకాశం నాకు దొరకలేదు. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది కనుక నేను బాగా చేయాలని అనుకున్నాను.. బాగా నటించాను. నేను నిజంగా చాలా గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నాను'' అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.

రష్మిక మందన్న చెప్పిన దాన్ని బట్టి డైరెక్టర్ సుకుమార్ బౌండ్ స్క్రిప్ట్‌తో పని చేయడని, సెట్స్ మీదకు వచ్చే వరకూ సీన్ పేపర్ లో చేంజెస్ చేస్తుంటారనే విషయం తెలుస్తోంది. నిజానికి సుక్కూ సైతం తాను స్పాట్ లో సన్నివేశాలను మారుస్తూ ఉంటానని గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. బహుశా తాను రాసిన సీన్ పట్ల అసంతృప్తి ఉండటమో లేదా బెటర్ మెంట్ కోసమో తెలియదు కానీ, దర్శకుడు అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటారని అర్థమవుతోంది. అయితే ఈ వర్కింగ్ స్టైల్‌ కారణంగానే సుకుమార్ సినిమాలు లేట్ అవుతుంటాయని, అనుకున్న సమయానికి కంప్లీట్ కావనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ''పుష్ప 2'' మూవీ పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం పట్టిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది కాబట్టి, సుక్కూపై ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. కానీ ఇప్పటి నుంచైనా దర్శకుడు కాస్త వర్కింగ్ స్టైల్ మార్చుకొని, ఫాస్ట్ గా సినిమాలు తీయాలని.. ఎక్కువ చిత్రాలను అందించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News