స్టార్ హీరోతో సినిమా రష్మిక ఇబ్బంది పడిందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఏ అవకాశాన్ని అమ్మడు విడిచి పెట్టడం లేదు. రానిరానీ అంటూ కొత్త చిత్రాలకు సంతకాలు మీద సంతకాలు చేస్తూనే ఉంది. అకౌంట్ కోట్ల రూపాయల పారితోషికం జమ చేస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో హిందీలో మూడు , నాలుగు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.
అందులో ఒకటి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోన్న `సికందర్`. మురగదాస్ దర్శకత్వం వహిస్తోన్న హై.-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్ పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రష్మిక తన్నకన్నా వయసులో బాగా పెద్దైవాడైన సల్మాన్ తోనే రొమాన్స్ చేస్తుంది. ఎప్పుడూ రొమాన్స్ జోలికి వేళ్ళని మురగదాస్ సైతం ఈసారి సల్మాన్ -రష్మిక మధ్య కొన్ని క్లోజ్ సన్నివేశాలు రాసినట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
అయితే ఈ సినిమాతో రష్మిక కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అకాల వర్షాల కారణంగా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగలేదుట. సెప్టెంబర్ లో భారీ వర్షపాతం నమోద వ్వడంతో షూటింగ్ కొన్ని రోజుల పాటు పాజ్ చేసారుట. తొలి రెండు రోజులు సెట్స్ కి వెళ్లి తిరిగి వచ్చేయవల్సి వచ్చిందిట. దీంతో ఆమరుసటి ఉదయం 7 గంటలకే పనిమొదలు పెట్టాల్సి వచ్చిందిట.
ఇలా ఉదాయాన్నే షూటింగ్ అనే సరికి రష్మిక అసౌకర్యానికి గురైందిట. గుర్ గావ్ లోని ఎస్ పీ ఆర్ ఎఫ్ గ్రౌండ్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉండగా వర్షం కారణంగా గ్రౌండ్ అంతా నీట మునగడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు యూనిట్ చెబుతుంది. ఇలా షూటింగ్ డిలే అయితే రష్మిక పూర్తి చేయాల్సిన తదుపరి సినిమాలపై ఈ ప్రభావం పడొచ్చని అంటున్నారు.