బ్రాండ్స్‌తో భారీగా ఆర్జిస్తున్న‌ ర‌ష్మిక

ఈ సంద‌ర్భంగా ఫోటోషూట్ లో బ్లాక్ లెద‌ర్ కోట్ ధ‌రించి స్టైలిష్ గా ఫోజులిచ్చింది. డైట్ సబ్య రూపంతో స్మోకీ క‌ళ్ల‌తో మ‌తులు చెడ‌గొట్టింది ర‌ష్మిక‌.

Update: 2024-09-19 17:35 GMT

జపనీస్ స్పోర్ట్స్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ఒనిట్సుకా టైగర్ కోసం రష్మిక మందన్న మిలన్ ఫ్యాషన్ వీక్‌కు హాజరయ్యారు. ఒనిట్సుకా లేబుల్ స్ప్రింగ్ సమ్మర్ 2025 దుస్తుల‌కు ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ త‌గిన ప్రాచుర్యం క‌ల్పిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఫోటోషూట్ లో బ్లాక్ లెద‌ర్ కోట్ ధ‌రించి స్టైలిష్ గా ఫోజులిచ్చింది. డైట్ సబ్య రూపంతో స్మోకీ క‌ళ్ల‌తో మ‌తులు చెడ‌గొట్టింది ర‌ష్మిక‌.

 

 

అయితే ర‌ష్మిక ఎంపిక‌పై ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాషన్ పేజీ అయిన డైట్ సబ్య స‌ర‌సంగా కామెంట్ చేసింది. మిలన్‌లో తన డే లుక్ స్టైలింగ్ కోసం స్మోకీ కళ్లతో ర‌ష్మిక‌ ఎంపికను డైట్ స‌బ్య‌ విమర్శించింది. ''ద్వేషించే వ్యక్తిగా ఉండకూడదు, కానీ లుక్ ప‌రంగా స్మోకీ ఐ రూపాన్ని డే షో కోసం ఎంపిక చేస్తారా? డే లో ఎవరూ స్మోకీ ఐ లుక్ లో లేరు..అది కూడా మిలన్‌లో!!'' అంటూ ఏడ్చే ఎమోజిని షేర్ చేసింది. రష్మిక స్మోకీ కళ్లపై డైట్ సబ్య చేసిన వ్యాఖ్యకు ప్ర‌తిస్పంద‌న‌గా త‌న‌ స్టైలిస్ట్ ప్రియాంక బోర్కర్ ప్రతిస్పందించారు. ఒక ఉల్లాసకరమైన వీడియోను పోస్ట్ చేస్తూ.. రష్మిక మేకప్ ఆర్టిస్ట్ తన్వి చెంబుర్కర్‌ను పగటిపూట కనిపించడానికి ఎందుకు స్మోకీ కళ్లను ఎంచుకున్నావు? అని అడిగారు. రష్మిక తన రూపాన్ని 'డిజాస్టర్' అని స్వ‌యంగా పేర్కొంది.

 

 

మిలన్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ఒనిత్సుకా టైగర్ SS 25 షోకు రష్మిక పూర్తిగా నలుపు రంగు దుస్తులతో హాజరయ్యారు. ర‌ష్మిక‌ ఉన్ని జాకెట్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. కోటు విషయానికొస్తే.. ఇది నాచ్ ల్యాపెల్ కాలర్‌లు, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లు, డబుల్ బ్రెస్ట్‌తో టైలర్డ్ ఫిట్ లుక్ తో ఆక‌ర్షిస్తోంది. రష్మిక పూర్తిగా నలుపు రంగు మేజోళ్ళు, రెండు చేతులకు అనేక ఉంగరాలు, సిల్వర్ స్టేట్‌మెంట్ చెవిపోగులు , వెల్వెట్ బ్లాక్ బ్లాక్-హీల్ లతో ఆల్-బ్లాక్ లుక్‌ను స్టైలింగ్ చేసింది. ర‌ష్మిక న‌టించిన పుష్ప 2 విడుద‌ల కావాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లో ర‌ష్మిక న‌టిస్తోంది.

Tags:    

Similar News