రష్మిక.. బౌండరీలు దాటేస్తున్న గ్లామర్ డోస్
గ్రాజియా బ్రాండ్‌తో పర్ఫెక్ట్ స్టైల్ కంప్లీట్ చేయడమే కాకుండా, తన అభిరుచిని వినూత్నంగా ప్రదర్శించారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా ఎన్ని హిట్స్ అందుకున్నా కూడా తన ఫ్యాషన్ స్టైల్‌తో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇటీవల గ్రాజియా మ్యాగజైన్ కవర్ ఫోటోలో కనిపించిన రష్మిక, కేవలం గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా, తన గ్లామర్ తో ఇతర ఇండస్ట్రీలో కూడా క్లిక్కయ్యేలా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలో ఆమె డబుల్ స్ట్రాప్ సిల్క్ వెల్వెట్ డ్రస్, లేస్ డిజైన్, గోల్డ్ స్టడ్స్‌తో కూడిన చోకర్ ధరించి స్టన్నింగ్ లుక్‌లో ఉన్నారు.
గ్రాజియా బ్రాండ్‌తో పర్ఫెక్ట్ స్టైల్ కంప్లీట్ చేయడమే కాకుండా, తన అభిరుచిని వినూత్నంగా ప్రదర్శించారు. ‘కిరాక్ పార్టీ’ మూవీతో కెరీర్ ఆరంభించిన రష్మిక, తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’, ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్డమ్ ను అందుకున్నారు. ‘పుష్ప’ మూవీతో ఆమె నేషనల్ క్రష్ గా పేరు సంపాదించారు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్న ఈ కన్నడ బ్యూటీ, తన కష్టపడే ధోరణి, ఫ్యాన్ ఫాలోయింగ్ తో ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు.
సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పటికీ, రష్మిక తన ఫేమ్ ను సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. "ఫేమ్కి బాధ్యత ఉంది" అని రష్మిక ప్రతిసారి చెబుతోంది. ఫ్యాషన్ లోను, లైఫ్ స్టైల్ లోను తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతున్నారు. తాజా గ్రాజియా కవర్ ఫోటోలో ఆమె వ్యక్తిత్వం ఎంత బోల్డ్ గా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది.
బిజీ షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ ఆమె మంచి ప్రాజెక్టులలో నటిస్తూ, డబుల్ షిఫ్ట్ లలో పనిచేస్తున్నారు. ప్రస్తుత కాలంలో అందరికీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక సవాల్. కానీ రష్మిక మాత్రం, అంకితభావంతో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్ కి ఇండస్ట్రీలోని పెద్ద ప్రాజెక్ట్‌లు క్యూ కడుతున్నాయనే చెప్పాలి, బాలీవుడ్ లో ‘యానిమల్’ తో ఇప్పటికే బిగ్ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం హిందీలో ‘చావా’, తెలుగులో కుబేర సినిమాలు చేస్తోంది.