నేషనల్ క్రష్‌ బ్యూటీ టిప్స్‌

అలాంటి బిజీ సమయంలో ఇలాంటి స్కిన్‌ మాస్క్ లు, ఫేస్ మాస్క్ లు వినియోగించడం మంచిది అన్నట్లుగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న సూచించింది.

Update: 2024-01-11 07:11 GMT

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకు యానిమల్ సినిమా హిట్ నేపథ్యంలో బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తన కొత్త సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా షేర్‌ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా మనం బిజీగా ఉండటం వల్ల అందం విషయంలో తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు తీసుకోలేము. అలాంటి సమయంలో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు డెర్మటాలజిస్ట్‌ వద్దకు వెళ్లేందుకు కూడా సమయం కొన్ని సందర్భాల్లో ఉండదు.

అలాంటి బిజీ సమయంలో ఇలాంటి స్కిన్‌ మాస్క్ లు, ఫేస్ మాస్క్ లు వినియోగించడం మంచిది అన్నట్లుగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న సూచించింది. ఈ అమ్మడు ఫేస్ మాస్క్ వేసుకుని ఉన్న ఫోటోను కూడా ఇన్‌ స్టా స్టోరీ లో షేర్ చేయడం జరిగింది.

సాధారణంగా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారును మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఈసారి తన బ్యూటీ సీక్రెట్‌ ను తెలియజేయడంతో పాటు, బ్యూటీ టిప్స్ ను తన ఫాలోవర్స్ తో షేర్‌ చేసుకోవడం జరిగింది. కనుక సోషల్ మీడియాలో ఈ అమ్మడి పోస్ట్‌ వైరల్ అయ్యింది.

యానిమల్‌ సినిమా తో బాలీవుడ్‌ లో మొదటి హిట్ ను దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు హిందీలో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పుష్ప 2 తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఈ అమ్మడు చేస్తోంది. ఈ ఏడాది రష్మిక నుంచి మూడు నాలుగు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News