పిక్ టాక్ : ఇంత క్యూట్ గా ఎలా ఉంటారు మేడం..!
అయితే అప్పుడప్పుడు ఇలా నిండైన చీర కట్టు ఫోటోలతో కూడా రష్మిక మందన్న ప్రేక్షకులకు మరియు నెటిజన్ లకు కన్నుల విందు చేస్తూ ఉంటుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో యానిమల్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంది. అంతకు ముందు రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న కమర్షియల్ గా సక్సెస్ లను దక్కించుకోవడం లో విఫలం అయింది. కానీ ఇప్పుడు రష్మిక మందన్న యానిమల్ తో ఏకంగా టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు తెలుగు లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప 2 లో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 లో అల్లు అర్జున్ కి జోడీగా శ్రీవల్లి పాత్రలో కనిపించబోతుంది. మొదటి పార్ట్ లో కనిపించిన దానికి పూర్తి విభిన్నంగా పార్ట్ లో శ్రీవల్లి ఉంటుందని అంటున్నారు.
ఇక రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఎక్కువగా స్కిన్ షో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఇలా నిండైన చీర కట్టు ఫోటోలతో కూడా రష్మిక మందన్న ప్రేక్షకులకు మరియు నెటిజన్ లకు కన్నుల విందు చేస్తూ ఉంటుంది.
తాజా ఫోటో షూట్ తో రష్మిక మందన్న ఆకట్టుకుంది. చీర కట్టులో చాలా అందంగా, క్యూట్ గా ఉన్నావంటూ అభిమానులు మరియు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా, క్యూట్ గా ఎలా ఉంటారు మేడం అంటూ కొందరు ఈమెను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన రష్మిక త్వరలో పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతుంది.