యానిమల్ గీతాంజలి.. ఈ వివరణ అందుకేనా..?
సందీప్ వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
సందీప్ వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఆరు రోజుల్లో 500 కోట్ల పైన వసూళ్లతో దూసుకెళ్తున్న యానిమల్ సినిమా ఓ పక్క హిట్ టాక్ తో ఎంత హంగామా చేస్తుందో సినిమా మీద కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా సినిమాకు ప్లస్ అయ్యి సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది.
లేటెస్ట్ గా సినిమాలో గీతాంజలి పాత్రలో నటించిన రష్మిక సినిమా గురించి కామెంట్ చేసింది. సినిమాలో తన పాత్ర గురించి తన ఇన్ స్టాలో పెద్ద స్టోరీ రాసుకొచ్చింది రష్మిక. గీతాంజలి గురించి చెప్పాలంటే అని మొదలు పెట్టిన రష్మిక ఆమె కుటుంబాన్ని ఒక చోట చేర్చే శక్తి.. ఆమె స్వచ్ఛమైంది.. ఆమె ప్రేమ బలమైనది, నిజమైంది అని అన్నారు. కొన్నిసార్లు నటిగా తను కూడా గీతాంజలి చేసే పనులు ప్రశ్నిస్తాను. అయితే దర్శకుడు నాకు చెప్పింది గుర్తుంది.
ఇది రణ్ విజయ్, గీతాంజలి కథ. వారి అభిరుచులు, ప్రేమ, కుటుంబం, వారి జీవితాలు ఇదే వారిద్దరు. బాధలు, హింసలు, భరించలేని ప్రపంచంలో గీతాంజలి నమ్మకాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఆమె భర్త, పిల్లలను సురక్షితంగా చూడమని దేవుళ్లని ప్రార్ధిస్తుంది. తుఫానులను ఎద్రుకొన్న శిల తను. కుటుంబం కోసం ఎదైనా చేస్తుంది. గీతాంజలి నా దృష్టిలో చాలా అందమైన అమ్మాయి. అందరి మహిళల్లానే కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది అని రాసుకొచ్చారు రష్మిక. రష్మిక గీతాంజలి పాత్రపై ఈ వివరణ గురించి మరో వెర్షన్ ఏంటంటే సినిమాలో తన పాత్ర గురించి నెగిటివ్ గా మాట్లాడే వారికి రష్మిక ఇలా క్లారిటీ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
యానిమల్ సినిమా విజయవంతంగా కొనసాగుతోంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రతి సినిమాను మరింత కష్టపడి చేసేలా చేస్తుంది అందుకు మీ అందరికీ హగ్స్ అంటూ రష్మిక ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యానిమల్ సినిమాతో రష్మిక మరో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆల్రెడీ పుష్పతో నేషనల్ వైడ్ సూపర్ హిట్ అందుకున్న అమ్మడు యానిమల్ తో మరోసారి ఆ ఫీట్ సాధించింది.