రష్మిక కెరీర్ కి గోల్డెన్ ఛాన్స్ ఇది!
ఈ నేపథ్యంలో అదే కోవలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న లక్కీ హీరోయిన్ అయింది.
శేకర్ కమ్ములా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే లక్కీ అనే అనాలి. హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్రని తెరపై అందంగా చూపించడం ఆయనకే చెల్లింది. ఇంకా చెప్పాలంటే హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్రని మరింత శక్తివంతంగా మలుస్తాయరాయన. ఆయన తెరకెక్కించిన కొన్నిసినిమాలైన ' ఆనంద్'..'గోదావరి'.. 'అనామిక'.. 'పిదా'..'లవ్ స్టోరీ' చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు ఎంత సమర్దవంతంగా సాగుతాయో తెలిసిందే. మిగతా చిత్రాల్లోనూ హీరోకు ధీటుగా హీరోయిన్ పాత్రల్ని మలిచారు.
హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు...నాలుగు రొమాంటిక్ పాటలకు భిన్నంగా ఆయన డిజైన్ చేసే పాత్రలుంటాయి. అందుకే శేఖర్ కమ్ములా దర్శకత్వంలో పనిచేయడానికి హీరోయిన్లు ఎక్కువగా ఆశపడతారు. సాయి పల్లివి టాలీవుడ్ లో అంత ఫేమస్ అయిందంటే ? దానికి కారణం ఆమె లో ఉన్న ట్యాలెంట్ తో పాటు..కమ్ములా విజన్ కీలక పాత్ర పోషించడంతోనే అది సాధ్యమైంది.
'ఫిదా'..'లవ్ స్టోరీ' లాంటి చిత్రాల్లో హీరోలున్నా! సాయి పల్లవికే ఎక్కువ పేరొచ్చిందంటే? దాని వెనుక అంత కథ ఉంది. ఈ నేపథ్యంలో అదే కోవలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న లక్కీ హీరోయిన్ అయింది. తాజాగా ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ములా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రష్మికని ఎంపిక చేసారు. రష్మిక ఇప్పటికే నిరూపించుకన్న నటి.
తొలి సినిమాతోనే చక్కని నటిగా విమర్శకుల ప్రశంసలందుకుంది. అటుపై 'గీతగోవిందం'..'పుష్ప' లాంటి సినిమాలు ఆమె స్థాయిని రెట్టింపు చేసాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కావడంతో తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. 'పుష్ప-2' తర్వాత మరింత ఫేమస్ అవుతుందనే అంచనాలున్నాయి.
ఇదే సమయంలో రష్మికకి శేఖర్ కమ్ములా దర్శకత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో నటిగా మరింత షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆమెలో సంపూర్ణ నటిని బయటకు తీసే సత్తా ఉన్న దర్శకుడు కాబట్టి ఈసినిమా అమ్మడికి పెద్ద అస్సెట్ అయ్యే అవకాశం ఉంది. రష్మిక లాంటి నటిని ఎంపిక చేసుకున్నారంటే? సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో గెస్ చేయోచ్చు.