మ‌రాఠీతో నేష‌న‌ల్ క్ర‌ష్ కుస్తీ!

మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మ‌రాఠీ ప‌దాలు ఎక్కువ‌గా మాట్లాడాల్సి వ‌స్తోందిట‌.

Update: 2024-08-11 15:30 GMT

ర‌ష్మిక మంద‌న్న నేడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. 'పుష్ప‌', 'యానిమ‌ల్' విజ‌యాల‌తో నేష‌న‌ల్ క్రష్ గా దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి కెరీర్ ని బాలీవుడ్ లోనే ప్లాన్ చేసుకుంటుంది. అందుకు త‌గ్గ‌ట్టు అవ‌కాశాలు అందుకుంటుంది. అయితే ఏ భాష‌కెళ్తే ఆ భాష‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌టం ర‌ష్మిక ప్ర‌త్యేక‌త‌. ఎలాగూ తంటాలు ప‌డి భాష‌ని ఈజీగా నేర్చుకుంటుంది. బేసిక్ గా అమ్మ‌డు క‌న్న‌డిగి. అక్క‌డ నుంచి టాలీవుడ్ కి వ‌చ్చింది.

తొలి సినిమా 'ఛ‌లో' స‌మాయ‌నికి తెలుగు స‌రిగ్గా రాదు. కానీ ఆ త‌ర్వాత కాలంలో తెలుగు భాష మాట్లాడ‌టం చూసి అంతా షాక్ అయ్యారు. ఇంత స్వ‌చ్ఛ‌మైన తెలుగు ఎప్పుడు నేర్చుకుంద‌ని అంతా స్ట‌న్ అయ్యారు. భాష వ‌చ్చిన నాటి నుంచి అమ్మ‌డు త‌న‌లో ఇంట‌ర్న‌ల్ ట్యాలెంట్ ని బ‌య‌ట‌కు తీసింది. లైవ్ లో ఆడ‌య‌న్స్ క‌వ్వించ‌డంలో అమ్మ‌డు దిట్ట‌. మాట‌ల‌తోనే బూరెలు వండ‌టం మొద‌లు పెట్టింది.

అటుపై త‌మిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసి ఆ భాష సైతం నేర్చుకుంది. అక్క‌డా మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఇక బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత త‌న‌లో వ‌చ్చిన మార్పులెన్నో. అక్క‌డ క‌ల్చ‌ర్కి త‌గ్గ‌ట్టు ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో ఎన్నో మార్పులు చేసింది. బికినీ,..స్విమ్ షూట్...చిట్టిపొట్టి దుస్తుల్లో కుర్ర‌కారును హీటెక్కించ‌డం..మీడియా స‌మావేశాల్లో హైలైట్ అవ్వ‌డం తెలిసిందే.

హిందీ భాష‌ని అంతే వేగంగా నేర్చుకుంది. ప్ర‌స్తుతం 'స‌వ్వా' అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది. విక్కీ కౌశ‌ల్ హీరోగా ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మ‌రాఠీ ప‌దాలు ఎక్కువ‌గా మాట్లాడాల్సి వ‌స్తోందిట‌. దీంతో ఈ భాష‌ను త‌ప్ప‌క నేర్చుకోవాల్సింది ద‌ర్శ‌కుడు ర‌ష్మిక‌కు చెప్పారుట‌. దీంతో అమ్మ‌డు ఇప్పుడు ఆ భాష కూడా సీరియస్ గా నేర్చుకుంటుందిట‌. కానీ నేర్చుకునే స‌మ‌యంలో చాలా స‌వాళ్లే ఎదుర‌వుతున్నాయ‌ట‌. మిగ‌తా భాష‌లంత ఈజీగా మ‌రాఠీ రావ‌డం లేద‌ని స‌న్నిహితు వ‌ద్ద అంటోందిట‌.

Tags:    

Similar News