జపాన్ ప్యాషన్ బ్రాండ్...టాప్ 10 లో నేషనల్ క్రష్!
అటుపై 'యానిమల్' తో ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకుంది. ఈ రెండు విజయాలు అమ్మడిని దేశాన్నే దాటించేసాయి. ఏకంగా జపాన్ వరకూ తీసుకెళ్లాయి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్నాళ్లగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. టాలీవుడ్ డెబ్యూ దగ్గర నుంచి బాలీవుడ్ వరకూ అమ్మడు తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటుంది. 'పుష్ప' తో పాన్ ఇండియా క్రేజ్ మొదలైంది. అటుపై 'యానిమల్' తో ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకుంది. ఈ రెండు విజయాలు అమ్మడిని దేశాన్నే దాటించేసాయి. ఏకంగా జపాన్ వరకూ తీసుకెళ్లాయి.
ఇటీవలే జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. జపాన్ లో ల్యాండ్ అవ్వగానే అమ్మడికి గ్రాండ్ ఎంట్రీ దొరకింది. అభిమానులు ప్లకార్డులు పట్టుకుని స్వాగతించిన వైనం అమ్మడికి జన్మంతా గుర్తిండిపోతుంది. తాజాగా జపాన్ టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ లిస్టును తయారు చేసి రిలీజ్ చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసిన ప్పుడు రశ్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలవడం విశేషం.
ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉంది. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రశ్మిక మందన్న ర్యాంప్ పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రశ్మిక ప్రమోట్ చేసింది. ఇంతవరకూ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఏ నటికి దగ్గలేదు. తొలిసారి ఆ అవకాశం భారతీయ నటిగా రష్మికనే దక్కించుకుంది.
దీంతో మార్కెట్ లో రష్మిక రేంజ్ ఏ స్థాయికి చేరింది అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. భవిష్యత్ లో ఆమె మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్ ల్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మడి వద్దకు వచ్చిన ఏ బ్రాండింగ్ ని వదలకుండా కమిట్ అవుతుంది. చిన్న...పెద్ద అనే తారతమ్యం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇక నటిగా రష్మిక ఎంత బిజీగా ఉందో తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.