మహేష్ తో పోలిక.. మురిసిపోతున్న అమ్మడు..!
మహేష్ బాబు ఆ సినిమాలో తన సిగ్నేచర్ స్టైల్ గా ఒక కన్నుతో చూస్తాడు. అఫ్కోర్స్ సినిమాలో రమణ పాత్ర లెఫ్ట్ ఐ కాస్త వీక్ అని గురూజీ చెప్పించాడు;
నేషనల్ క్రష్ రష్మిక ఏం చేసినా సరే అదో సెన్సేషనల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ యానిమల్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న అమ్మడు త్వరలో పుష్ప 2 తో మరో బిగ్గెస్ట్ హిట్ టార్గెట్ పెట్టుకుంది. ఆగష్టులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా నుంచి రష్మిక పోస్టర్ వదిలారు. శ్రీవల్లి కొత్త లుక్ కిరాక్ అనిపించింది. రష్మిక బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ గుంటూరు కారం లో మహేష్ ని గుర్తు చేస్తుంది.
మహేష్ బాబు ఆ సినిమాలో తన సిగ్నేచర్ స్టైల్ గా ఒక కన్నుతో చూస్తాడు. అఫ్కోర్స్ సినిమాలో రమణ పాత్ర లెఫ్ట్ ఐ కాస్త వీక్ అని గురూజీ చెప్పించాడు. సో మహేష్ అలా చేతిని కుడి కన్నుకి ఫోకస్ పెట్టి చూస్తాడు. అయితే పుష్ప 2 నుంచి వదిలిన రష్మిక పోస్టర్ కూడా అచ్చం అలానే ఉంది. రష్మిక ని గుంటూరు కారం లోని మహేష్ తో పోల్చుతున్నారు. ఈ పోలికపై స్పందించింది రష్మిక మందన్న.
తనను మహేష్ స్టిల్ తో పోల్చడంపై ఓ నైక్ ఐల్ లైజ్ దిస్ కోల్లేజ్ అంటూ ఆ పోస్టర్ పై స్పందించింది రష్మిక. రమణగాడితో శ్రీ వల్లి ని కలిపి చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ తో రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది. అనిల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తెలుగులో సూపర్ ఫాం కొనసాగిస్తున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ దూసుకెళ్తుంది. రష్మిక ఏదైనా సినిమాలో ఉంది అంటే రా ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడుతుంది. ఓ పక్క పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా అమ్మడు సై అనేస్తుంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది రష్మిక. రీసెంట్ గా రిలీజైన గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సూపర్ అనిపించుకున్నాయి. రాబోయే సినిమాలతో రష్మిక బాలీవుడ్ స్టార్స్ ని కూడా పక్కకు నెట్టేసి నేషనల్ వైడ్ గా టాప్ ప్లేస్ లో నిలిచేలా ఉందని చెప్పొచ్చు.