రష్మిక.. ఓ వైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్

పాన్ ఇండియా హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన్న.

Update: 2024-07-13 05:01 GMT

పాన్ ఇండియా హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన్న. ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె పోర్షన్ కి సంబందించిన సీక్వెన్స్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయి. గత ఏడాది యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో రష్మిక మందన సూపర్ సక్సెస్ అందుకుంది. హిందీలో ఆమెకు అది మూడవ చిత్రం. మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఇవ్వకపోయిన యానిమల్ సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది.

 

యానిమల్ తర్వాత హిందీలో రష్మిక మందన్నకి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ బ్యూటీ సెలక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ రష్మిక మందన్న సినిమాలో లైన్ అప్ చూసుకుంటే విజయ్ దేవరకొండకి జోడీగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ మూవీ చేయబోతోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న డ్రాగన్ మూవీలో రష్మికను హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హిందీలో ఓ యంగ్ హీరోతో మూవీ లైన్ లో ఉంది.

ఇవి కాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక మందన చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. మేగ్జిమమ్ రష్మిక మందన చేతిలో అన్ని పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. పుష్ప ది రూల్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత రష్మిక ఇమేజ్ మరింత పెరిగిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

 

ఒక వేళ వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకుంటే రెమ్యునరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో రష్మికకి 43.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా రష్మిక మందన్న ఉంది. పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ఆమె ఫాలోవర్స్ పెరిగారు.


తాజా గా ఈ బ్యూటీ ఎల్లో కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలని ఏకంగా 9.78లక్షల మంది లైక్ చేశారు. ఈ పిక్స్ తో రష్మిక చాలా క్యూట్ గా అచ్చ తెలుగు అందంలా మెరిసిపోతోంది. ఈ ఫోటోలకి ఆమె ఇంటరెస్టింగ్ కొటేషన్ కూడా ఇచ్చింది. నేను ఎల్లో కలర్ ని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఏంటో తెలుసా… ఇది సన్ లైట్ ని, ప్లవర్స్ అందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే దయని మనలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పుకొచ్చింది. ఈ ఫోటోలలో రష్మిక అందంతో మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News