విజయ్ కి రష్మిక నో చెప్పిందా?
ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది.
విజయ్ దేవరకొండకు రష్మికమందన్నా నో చెప్పిందా? దేవరకొండ సరసన నటించే ఛాన్సే లేదందా? విజయ్ ఒకే అన్నా...రష్మిక నాట్ ఒకే అంటోందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ఇక వీరిద్దరిది సక్సెస్ పుల్ కాంబినేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. `గీత గోవిందం`..`డియర్ కామ్రేడ్` లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కాయి. వాటితోనే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ అనిపించింది. వాళ్లిద్దరి మధ్య ఉన్నంత అండర్ స్టాండింగ్.. కెమిస్ట్రీ మరో జోడీతో సెట్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. కెమిస్ట్రీ అలా సూటయింది కాబట్టే అంతగా పాపులర్ అయ్యారు.
ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. సరిగ్గా అలాగే భావించి దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఆ కాంబినేషన్ ని మళ్లీ కలపాలని ట్రై చేసినట్లు సమాచారం. విజయ్ దేరకొండ హీరోగా రాహుల్ దర్శకత్వంలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి సినిమా తర్వాత విజయ్ ...రాహుల్ చిత్రాన్నే సెట్స్ కి తీసుకెళ్లే అవకాశాలున్నాయని వినిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పనుల్లోనే రాహుల్ బిజీగా ఉన్నాడు.
స్టోరీ లాక్ అయిన నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యారు. దీనిలో భాగంగా హీరోయిన్ గా రష్మిక బాగుంటుందని ఆమెని సంప్రదించాడుట. కలిసి స్టోరీ నేరేట్ చేయగా ఆమె పాత్ర విషయంలో అసంతృప్తిగా స్పందించిందిట. స్టోరీ బాగున్నా తన పాత్ర బలంగా లేకపోవడంతో ఆ పాత్ర చేయనని చెప్పిందిట. విజయ్ తో సినిమా అంటేనే హీరోకి ధీటుగా లేకపోయినా మినిమంగానైనా రోల్ ఉండాలని స్పందించిదట. పాత్ర పరంగా ఛేంజెస్ తీసుకొస్తే ఒకే లేకపోతే నాట్ ఒకే అని చెప్పిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇది నిజమైతే షాకింగ్ అనే అనాలి. విజయ్ తో సినిమా ఛాన్స్ అంటే రష్మిక వదులుకొదు అన్నది అభిప్రాయం. అదే నమ్మకంతో దర్శకుడు కాన్పిడెంట్ గా వెళ్లి స్టోరీ చెప్పి ఉండొచ్చు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె నుంచి రిప్లై వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక కెరీర్ లో బాలీవుడ్ లో పీక్స్ లో ఉంది. `యానిమల్` విజయం తర్వాత వరుసగా స్టార్ హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తోనే ఓ సినిమా చేస్తుంది. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనూ నటిస్తోంది. `పుష్ప-2` తర్వాత అమ్మడి పాన్ ఇండియా క్రేజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఆ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలన్నీ అంతకు మించి ఉండాలన్నది అమ్మడి ప్లాన్ గా కనిపిస్తుంది.