చీర కట్టుతో శ్రీవల్లి మళ్లీ కన్నుల విందు

తాజాగా ఈ అమ్మడు దుబాయ్‌ లో సందడి చేసింది. అక్కడ చీర కట్టు లో అది కూడా నిండైన చీర కట్టులో కనిపించి కన్నుల విందు చేసింది.

Update: 2023-10-02 03:37 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినిమాలతో కంటే కూడా ఎక్కువగా రష్మిక సోషల్ మీడియాలో తన ప్రేమ విషయం మరియు హాట్ ఫోటో షూట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా రష్మిక మందన్నా వెండి తెరపై చూపించే అందాల కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఎక్కువ చేస్తుంది.


స్కిన్‌ షో చేసినా, చీర కట్టులో కనిపించినా కూడా రష్మిక ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు దుబాయ్‌ లో సందడి చేసింది. అక్కడ చీర కట్టు లో అది కూడా నిండైన చీర కట్టులో కనిపించి కన్నుల విందు చేసింది. శ్రీవల్లి ని ఇలా నిండైన చీర కట్టులో చూడటం కన్నుల విందుగా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఎప్పుడూ స్కిన్‌ షో చేస్తూ, క్లీ వేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డీసెంట్‌ చీర కట్టు ఫోటోల్లో కూడా కనిపిస్తే బాగుంటుందని రష్మిక ఫ్యాన్స్ ఈ ఫోటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు. అందాల ఆరబోత ఫోటోల కంటే కూడా రష్మిక చీర కట్టు లో మరింత సెక్సీగా కనిపిస్తుంది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా తో మరోసారి శ్రీవల్లిగా అలరించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు లో పుష్ప 2 సినిమా రాబోతుంది. మరో వైపు నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమా లో ఈ అమ్మడు నటిస్తోంది. ఇక బాలీవుడ్ మూవీ యానిమల్‌ పై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. ఇటీవలే ఆ సినిమా నుంచి వచ్చిన లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. మొత్తానికి రష్మకి మందన్నా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ కి కన్నుల విందు చేస్తూనే ఉంది.

Tags:    

Similar News