నేషనల్ క్రష్ అంటే ఆవిడ ఫీలైందా?
నేషనల్ క్రష్ అంటే అందరికీ గుర్తొచ్చేది రష్మిక మందన్నా. అమ్మడికి `పుష్ప` తర్వాత వచ్చిన గుర్తింపు అది.
నేషనల్ క్రష్ అంటే అందరికీ గుర్తొచ్చేది రష్మిక మందన్నా. అమ్మడికి `పుష్ప` తర్వాత వచ్చిన గుర్తింపు అది. అంతవరకూ అమ్మడి ట్యాలెంట్ కేవలం సౌత్ కే పరిమితమైంది. `పుష్ప` విజయం పాన్ ఇండియాలో సంచలనమవ్వడంతో రష్మిక రేంజ్ మారింది. ఆ రకంగా అప్పటి నుంచి నేషనల్ క్రష్ గా ఫేమస్ అయింది. అటుపై బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడంతో రష్మికకి తిరుగులేని తార అన్న ట్యాగ్ ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఏకంగా అక్కడి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు అమ్మడు ఇంకా అడుగు దూరంలోనే ఉంది. సల్మాన్ ఖాన్ తో సికందర్ లో నటిస్తోంది. అలాగే మరికొంత మంది యంగ్ హీరోలకు జోడీగా నటిస్తోంది. ఇలా ఉత్తరాదిన రష్మిక జర్నీ సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇటేవలే నేషనల్ క్రష్ అంటూ హాట్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీ కూడా తెరపైకి వచ్చింది. ఆరేడు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క యానిమల్ తోపాన్ ఇండియాలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ విజయం తరువాత త్రిప్తీ చాలా కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. బాలీవుడ్ అంతటా బాబిగా ఫేమస్ అయింది. ఆ క్రేజ్ తో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీని కూడా నెటి జనులు నేషనల్ క్రష్ అంటూ కొత్త పిలుపు మొదలు పెట్టారు. అంతవరకూ బాబిగా హైలైట్ చేసిన జనం కొత్తగా నేషనల్ క్రష్ అనడం ఆసక్తికరంగా మారింది. గతవారమైతే ఏకంగా ట్రెండింగ్ లోనే నిలిచింది.
అయితే త్రిప్తీని ఇలా సంబంధించడంపై రష్మిక ఫీలవుతుందనే టాక్ వినిపిస్తుంది. తనకి మాత్రమే సొంతమైన ట్యాగ్ తో మిగతా నటుల్ని ఎలా పిలుస్తారు? అనే అంశాన్ని తన పీఆర్ టీమ్ వద్ద ప్రస్తావిం చిందిట. దీంతో రష్మిక ఈ విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉందనిపిస్తుంది. మరి ఈ ట్యాగ్ ని పర్మినెంట్ చేసుకోవడం అంటే ఎలా? అంటే అందుకు ఛాన్స్ లేదు. నెటి జనులు ఇచ్చిన ట్యాగ్ కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉండదు. అదే ట్యాగ్ పరిశ్రమ గుర్తించి ఇస్తే అవకాశం ఉంటుంది. త్రిప్తీ నటించిన `యానిమల్` లో రష్మిక మందన్న రణబీర్ కి భార్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.