వద్దు అని చెప్పినా బలవంతంగా ఆ పని చేయించారు! రతన్ రాజ్‌పుత్
మీటూ ఉద్యమం సమయంలో
'మీటూ ఉద్యమం'లో భాగంగా లైంగికంగా బాధింపబడ్డ వారంతా! ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లో భాగంగా లైంగిక దోపడిపై ఎంతో మంది నటీమణులు విస్తుపో యే వాస్తవాలు బయట పెట్టారు. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లో నూ దొపిడికి గురైన వారంతా తమ బాధని చెప్పుకునే ప్రయత్నం చేసారు. ఇప్పటికీ ఆ కాక చల్లారలేదు. నిత్యం ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చెప్పుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రతన్ రాజ్‌పుత్ ఇదే అంశం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
'మీటూ ఉద్యమం సమయంలో చాలా మంది తమ అనుభవాలు పంచుకున్నారు. కానీ అప్పుడు మాట్లాడలేకపోయాను. ఇప్పటికైనా మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేని ధైర్యంగా ముందుకొచ్చాను. ఇండస్ట్రీలో జరుగుతోన్న చీకటి కోణాలను యువతరం నటీమణులు తెలుసుకోవాలి. సినిమా...టీవీ పరిశ్రమలు మొత్తం చెడ్డది కాదు. కొంద మంది కామాంధులున్నారు.
అలాంటి వారి కారణంగానే అందరికీ చెడ్డ పేరు వస్తోంది. ఓసారి ఆడిషన్ ఉందంటే ముంబై ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆరోజు ఆడిషన్ అంతా బాగా జరిగింది.
డైరెక్టర్ కి మీ ప్రతిభ నచ్చింది. ఆయనతో సమావేశానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆ త్వాత దర్శకుడిని కలిసేందుకు పై ఫ్లోర్ కు వెళ్లాను. అప్పుడే వద్దు అని చెప్పినా? బలవంతంగా ఓ కూల్ డ్రింక్ తాగించారు. అది తాగిన సెకెన్ల వ్యవధిలోనే తేడాగా అనిపించింది. ఆ తర్వాత మరో ఆడిషన్ ఉంటుంది. మళ్లీ కాల్ చేస్తాం అని చెప్పగానే అక్కడ నుంచి వెళ్లిపోయాను.
మళ్లీ కొన్ని గంటల అనంతరం కాల్ చేసారు. మరో ఆడిషన్ ఉందని ఓ ప్లేస్ చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లాను. ఆ రూం చాలా భయంకరంగా ఉంది. ఆ గది అంతా వస్తువులు.. దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి.
అక్కడే ఓ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించింది. నా వెంట ఓ అబ్బాయిని తీసుకెళ్లా. బోయ్ ప్రెండ్ ని ఎందుకు తీసుకొచ్చావ్ అని సీరియస్ అయ్యారు. అతను మా అన్నయ్య అని చెప్పా. వాళ్లు సైలెంట్ అయ్యారు. అప్పటికే నాకు అక్కడి వాతావరణమంతా తేడాగా అనిపించింది. భయం వేసినట్లు అనిపించింది. దీంతో ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని అక్కడ నుంచి బయట పడ్డాను' అని తెలిపింది.