మళ్లీ వస్తున్న 'రతి నిర్వేదం'... ఇంకెన్ని చూడాలో!

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు పాత సినిమాలతో వినోదాన్ని అందిస్తు కొందరు నిర్మాతలు తమ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.

Update: 2023-09-23 05:57 GMT

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు పాత సినిమాలతో వినోదాన్ని అందిస్తు కొందరు నిర్మాతలు తమ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. మొదట స్టార్‌ హీరోల సినిమాలు వారి వారి పుట్టిన రోజులు లేదా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే రీ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్నా చితక సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.

స్టార్‌ హీరోల సినిమాలను ఎలా అయితే హడావుడితో రీ రిలీజ్ చేస్తున్నారో చిన్న హీరోల సినిమాలను, గతంలో వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిన్న సినిమాలను సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తూ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 7/జీ బృందావన్ కాలనీ సినిమా రీ రిలీజ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

కొన్ని విభిన్న చిత్రాలను మరియు సూపర్‌ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయడంలో తప్పులేదు. కానీ శృంగారభరిత సినిమా అయిన రతి నిర్వేదం ను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవ్వడం చర్చనీయాంశం అయింది. శ్వేత మీనన్‌ ముఖ్య పాత్రలో నటించిన రతి నిర్వేదం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.

మధ్య వయస్కురాలు అయిన శ్వేతా మీనన్ తో కుర్రాడు ప్రేమలో పడటం, ఇద్దరి మధ్య శృంగార సంబంధం ఏర్పడటం వంటి సన్నివేశాలతో రతినిర్వేదం సినిమా సాగుతుంది. సాప్ట్‌ పోర్న్‌ సినిమా గా ఈ సినిమా నిలిచింది. అప్పట్లో యూత్ ఆడియన్స్ తో ఈ సినిమా ఆడిన థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండి పోయాయి.

ఇప్పుడు మళ్లీ రతి నిర్వేదం సినిమాను తీసుకు రావాలి అనుకోవడం విడ్డూరంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల రతి నిర్వేదం వంటి రొమాంటిక్ మూవీకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఫోన్ ల్లో మరియు కంప్యూటర్స్ లో రతినిర్వేదం వంటి సినిమాలు చాలా చూస్తున్నారు. కనుక రీ రీలీజ్ తో పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇంకా ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి ఉందో అంటూ తల పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News