50 వ‌య‌సులో బాల‌య్య హీరోయిన్ మైండ్ బ్లాక్!

రాషా ఆరంగేట్రం ఎన్బీకే కుమారుడు మోక్ష‌జ్ఞ‌తో ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

Update: 2024-10-27 00:30 GMT

ర‌వీనా టాండ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 90ల‌లో బాల‌కృష్ణ స‌ర‌స‌న 'బంగారు బుల్లోడు' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించింది. ఇటీవ‌ల కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2లోను న‌టించింది. హిందీలో వ‌రుస‌గా వెబ్ సిరీస్ లకు సంత‌కాలు చేసిన ర‌వీనా టాండ‌న్, కొన్ని పెద్ద తెర అవ‌కాశాల‌ను ఒడిసిపడుతోంది. మ‌రోవైపు కుమార్తె రాషా త‌డానీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఊహాగానాలు ర‌వీనాను హెడ్ లైన్స్ లో ఉంచుతున్నాయి. రాషా ఆరంగేట్రం ఎన్బీకే కుమారుడు మోక్ష‌జ్ఞ‌తో ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.


ఈ తెలిసిన క‌థంతా అటుంచితే.. ర‌వీనా అర్థ సెంచ‌రీ (50) కొట్టినా ఇంకా టీనేజీ వైబ్స్ వెద‌జల్లుతూ మ‌తులు చెడ‌గొట్ట‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీనికి తాజా నిద‌ర్శ‌నం ఈ ఫోటోషూట్. ఫెమీనా ఇండియా క‌వ‌ర్ పేజీపై ర‌వీనా స‌రి కొత్త‌గా ట్రెండీగా క‌నిపించింది. నేటిత‌రం ఫ్యాష‌నిస్టాల‌తో ఎలాంటి పోటీకి అయినా తాను సిద్ధంగా ఉన్నాన‌ని ఫీల‌ర్స్ వ‌దిలింది. బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో ర‌వీనా టాండ‌న్ ఫోజులిచ్చిన తీరు క‌ట్టిప‌డేస్తోంది.

ఫెమీనా మ్యాగ‌జైన్ కవర్ పేజీపై ఎప్పటికీ రవీనా టాండన్ క‌నిపిస్తూనే ఉంటార‌ని, నేడు త‌న‌ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆ ఐకానిక్ వైబ్స్ ని తీసుకువస్తూ ఈ క‌వ‌ర్ షూట్ ని రెడీ చేస్తున్నామ‌ని పేర్కొంది. ఆస‌క్తిక‌రంగా ఫెమినా ఇండియాతో ర‌వీనా డీల్ ఇప్ప‌టిది కాదు. చాలా సంద‌ర్భాల‌లో ఫెమీనా క‌వ‌ర్ పేజీపై ర‌వీనా ముఖ‌చిత్రం క‌నిపించింది. ఇప్ప‌టికీ ఆ రిలేష‌న్ అలానే కొన‌సాగుతోంది.

Tags:    

Similar News