పెదాలు తాకగానే వాంతి అయింది! రవీనా టాండన్
నేను పరిశ్రమకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సన్నివేశంలో నటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది సినిమాలో సీన్ కాదు. అతను కావాలని చేయలేదు.
బాలీవుడ్ లో పెదవి ముద్దుల పాలసీ అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. ఇంటిమేట్ సన్నివేశాల్లో భాగంగా హీరో-హీరోయిన్ల మధ్య అదర చుంబనాలు తప్పనిసరి. ఇలాంటివన్నీ అక్కడ నుంచే మిగతా పరిశ్రమల్లోకి వచ్చాయి. అలాగని అందరూ నటిచాలని కాదు. కొందరు ఇప్పటికీ నో లిప్ కిస్ పాలసీని అనుసరిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా పెదవి ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకి.
తాజాగా ఓ పాత అనుభవాన్ని గుర్తు చేసుకోనున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ సన్నివేశంలో నటించాక వాంతులు చేసుకున్నట్లు తెలిపారు. సహ నటుడి పెదాలు తాకగానే కడుపులో వికారం పుట్టి వాంతులు అయ్యాయట. 'ఆరోజుల్లో కాంట్రాక్టులు లాంటివి ఏవీ లేవు. నేను తొలి నుంచి ముద్దు సన్నివేశాలకు దూరంగానే ఉన్నాను. అలాంటి వాటిలో నటిస్తే చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.
నేను పరిశ్రమకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సన్నివేశంలో నటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది సినిమాలో సీన్ కాదు. అతను కావాలని చేయలేదు. పొరపాటున జరిగింది. దీంతో నాకు చాలా ఇబ్బంది గా అనిపించింది. ఒక్కసారిగా కడుపు అంతా వికారంతో నిండిపోయింది. వెంటనే రూమ్ కి వెళ్లాను. వికారంతో వాంతులు అయ్యాయి.
నోటిని వందసార్లు కడగాలి అనిపించింది. అప్పటికే చాలాసార్లు కడిగాను. ఆ సంఘటన జరిగిన తర్వాత హీరో నాకు క్షమాపణలు కూడా చెప్పారు' అని అన్నారు. అయితే ఆ సినిమా పేరు ఏంటి? అతను ఏ హీరో? ఎప్పుడు జరిగింది? వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఇటీవలి కాలంలో రవీనా టాండన్ పాత సినిమా షూటింగ్ ల్లో భాగంగా ఆన్ సెట్స్ లో ఎదురైన అనుభవాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా పాట చిత్రీకరణలో భాగంగా వర్షంలో షూట్ చేస్తున్నప్పుడు ఆమె ఎలాంటి అసౌకర్యానికి గురయ్యారో రివీల్ చేసారు. సీనియర్ నటీమణులు ఇలాంటి విషయాలు రివీల్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.