క‌ష్టాల్ని ఆస్వాధించాన‌న్న రవితేజ

రవితేజ తన అన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ... తాను ఇప్పుడు ఉన్న స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డానని, తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలన్నీ తనకు నచ్చాయని చెప్పాడు.

Update: 2023-10-13 03:15 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `టైగర్ నాగేశ్వరరావు` ఈ నెల 20 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజ‌ర్, పోస్ట‌ర్ లు ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. ఇటీవ‌ల‌ రిలీజైన‌ ట్రైలర్ ఊహ‌ను మించి ఆకర్షించడంతో ఈ చిత్రానికి చాలా పాజిటివ్ బజ్ ఏర్ప‌డింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీ ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానుండ‌గా, క‌థానాయిక‌ల అంద‌చందాలు అభిన‌యం కూడా అద‌న‌పు అస్సెట్ కానుంద‌ని టాక్ వ‌చ్చింది. ఇప్ప‌టికే రిలీజైన సింగిల్స్ కూడా ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

రిలీజ్ ముంగిట‌ రవితేజ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అతడు తెలుగు రాష్ట్రాల‌ను మించి ఇరుగు పొరుగునా ప్ర‌చారం సాగిస్తున్నాడు. ముంబైకి వెళ్లి హిందీ వెర్ష‌న్ ని ప్ర‌మోట్ చేసాడు. రవితేజ తన అన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ... తాను ఇప్పుడు ఉన్న స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డానని, తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలన్నీ తనకు నచ్చాయని చెప్పాడు.

నేను నా పోరాటంలో ప్రతి ఒక్క రోజును గుర్తుంచుకుంటాను. చాలా ఆనందిస్తాను. నేనెప్పుడూ ఆశకోల్పోను. ఏదో ఒక రోజు అనుకున్న‌ది చేస్తానని నాకు తెలుసు! అని రవితేజ చెప్పారు.

వంశీ దర్శకత్వం వహించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ ఒక క‌థానాయిక కాగా, నూపూర్ సనన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ స‌హా దేశంలోని ప్ర‌ధాన భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ర‌వితేజ‌కు పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ అని అభిమానులు న‌మ్ముతున్నారు.

Tags:    

Similar News