మాస్ రచ్చ.. రవితేజ సీక్వెల్ చేయాల్సిందే

అంత వరకు రవితేజలో ఒక్క యాంగిల్ ని మాత్రమే చూసిన ఆడియన్స్ కి విక్రమార్కుడు సినిమాతో మరో స్టైల్ హీరోని కూడా జక్కన్న పరిచయం చేశాడు.

Update: 2024-07-28 07:07 GMT

మాస్ మహారాజ్ రవితేజ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రవితేజకి ఈ మూవీ ఏకంగా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. అంత వరకు రవితేజలో ఒక్క యాంగిల్ ని మాత్రమే చూసిన ఆడియన్స్ కి విక్రమార్కుడు సినిమాతో మరో స్టైల్ హీరోని కూడా జక్కన్న పరిచయం చేశాడు. అందుకే ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమా రీమేక్ అయిన అన్ని భాషలలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిందీలో అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్ టైటిల్ తో ఈ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. తమిళంలో కార్తీ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత విక్రమార్కుడు మూవీని మరల 4K వెర్షన్ లో రీరిలీజ్ చేశారు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈలలు వేస్తూ సందడి చేశారు.

కొంతమంది జింతాక్ సాంగ్ ని అనుకరించారు. మరికొంత మంది పోలీస్ గెటప్ లో వచ్చి డాన్స్ లు చేయడం విశేషం. ఫ్యాన్స్ సందడి అయితే థియేటర్స్ లో నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. థియేటర్స్ లో ఈ సందడి చూసిన తర్వాత మాస్ మహారాజ్ నుంచి విక్రమార్కుడు రేంజ్ ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మెన్స్ ని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే విక్రమార్కుడు సీక్వెల్ చేస్తే భారీ హైప్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే విక్రమార్కుడు సీక్వెల్ చేయడానికి ఓ బడా నిర్మాత సిద్ధం అయ్యాడు. విజయేంద్రవర్మ కూడా ఈ సీక్వెల్ స్టోరీ రాయనున్నారని సదరు ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు. ఒక వేళ అన్ని సెట్ అయితే రవితేజ హీరోగా విక్రమార్కుడు 2 మూవీని ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది.

అయితే రవితేజ మాత్రం మళ్ళీ రాజమౌళి డైరెక్ట్ చేస్తేనే ఆ సీక్వెల్ చేస్తానని అన్నాడు. ఇక రాజమౌళి అయితే ఇప్పట్లో బడా హీరోలతో అంతకుమించి అనేలా సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు సీక్వెల్ చేయడం కష్టమే. ఇక వేరే హీరో చేస్తే ఆ రేంజ్ కిక్ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా రవితేజను మాత్రం మళ్ళీ ఆ రేంజ్ పెర్ఫెమెన్స్ తో చూడాలని ఆడియెన్స్ అయితే ఆశతో ఉన్నారు అని అర్ధమవుతుంది.

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఆగష్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో మిస్టర్ బచ్చన్ సినిమాని నిర్మిస్తోంది. ఈ మధ్యకాలంలో రవితేజ కొత్త సినిమాల రిలీజ్ సమయంలో కూడా లేని సందడి విక్రమార్కుడు రీరిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో కనిపించడం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.



Tags:    

Similar News