RRR ఫార్ములాతోనే టైగర్ కథ!

టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురంలో మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉండేవాడు. పోలీసులకి చిక్కకుండా ఎన్నో దొంగతనాలు చేసిన అతను చనిపోయినపుడు వేలాదిమంది తరలివచ్చారు.

Update: 2023-10-08 05:00 GMT

టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురంలో మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉండేవాడు. పోలీసులకి చిక్కకుండా ఎన్నో దొంగతనాలు చేసిన అతను చనిపోయినపుడు వేలాదిమంది తరలివచ్చారు. అలాంటి నిజ జీవిత దొంగ కథతో వంశీకృష్ణ ఆకెళ్ళ టైగర్ నాగేశ్వరరావు మూవీ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకి థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో మూవీ రిలీజ్ అవుతోంది.

ఇండియాకి క్రైమ్ క్యాపిటల్ అంటూ స్టువర్టుపురం గురించి చెప్పడం ద్వారా ఈ సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై స్టువర్టుపురం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకి కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు కథని జరిగింది జరిగినట్లు కాకుండా ఆర్ఆర్ఆర్ ఫార్ములాని ఉపయోగించుకొని దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

టైగర్ నాగేశ్వరావు లైఫ్ లో కొన్ని కీలక ఘట్టాలని, పాత్రలని తీసుకొని వాటిని కంప్లీట్ గా ఫిక్షనల్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాటిక్ లిబర్టీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ట్రైలర్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. టైగర్ నాగేశ్వరావు పాత్రని హీరోయిక్ రేంజ్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కారణంగానే ఈ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

అలాగే ఫిక్షనల్ డ్రామాని జోడిస్తూ హీరోయిన్ పాత్రని ఎస్టాబ్లిష్ చేశారు. రియల్ స్టొరీలో అయితే ఒక అమ్మాయి కారణంగానే టైగర్ నాగేశ్వరరావు పోలీసులకి చిక్కి తరువాత ఎన్ కౌంటర్ లో చంపబడ్డాడు. అయితే ఆ విషయాన్ని మూవీలో ఏ విధంగా ఆవిష్కరిస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రౌడీలకే దడ పుట్టించే పెద్ద రౌడీగా టైగర్ నాగేశ్వరావు పాత్రని అయితే వంశీ కృష్ణ ఆవిష్కరించారు.

ఈ క్యారెక్టర్ కి రవితేజ కూడా పూర్తిగా న్యాయం చేసినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ గా ఈ చిత్రంలో నుపూర్ సనన్ నటిస్తోంది. రేణు దేశాయ్ చాలా ఏళ్ల తర్వాత నటిగా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్ర కూడా మూవీలో చాలా కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. టైగర్ నాగేశ్వరావు జీవితాన్ని ప్రభావితం చేసే పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుందంట.

Tags:    

Similar News