'రజాకర్' టీజర్ : ఇండియాకు స్వతంత్ర్యం వచ్చింది కానీ హైదరాబాద్‌కు రాలేదు
తాజాగా ఈ మూవీటీమ్ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించి టీజర్‌ను విడుదల చేసింది. అలాగే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
భారతదేశానికి.. బ్రిటీష్ నుంచి స్వతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రజాకార్లు పెత్తనం చేసేవారు. దీంతో ఆ రజాకార్లపై కూడా ఎంతో మంది పోరాడి ప్రాణత్యాగాలు చేశారు. అలా వారిపై పోరాడి ప్రాణ త్యాగం చేసిన వారిలో బత్తిని మొగిలయ్య గౌడ్ ఒకరు. నిజాం రజాకార్లను ధైర్యంగా ఎదిరించి ప్రాణ త్యాగం చేసిన ఆయన జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం 'రజాకర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ సైలెంట్ జీనైసైడ్ ఆఫ్ హైదరాబాద్ ట్యాగ్ లైన్.
తాజాగా ఈ మూవీటీమ్ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించి టీజర్‌ను విడుదల చేసింది. అలాగే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. వందేమాతరం స్లోగాన్ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ వీడియోలో ఇండియాకు స్వతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్‌కు రాలేదు అంటూ నగరంపై నిజాం రజాకార్ల ఏవిధంగా పెత్తనం చెలాయించారో చూపించారు.
ప్రతి ఒక్కరూ ఇస్లామిక్ మతాన్ని అనుసరించాలంటూ.. ఇతర కులాలు, మతాలపై చేసిన వారు చేసిన అరాచకాలు, సృష్టించిన మారణహోమాన్ని వంటివి చూపించారు. అత్యంత పాశవికంగా మహిళలపై అత్యాచారాలు, తమ నిబంధనలకు ఎదురుతిరిగిన వారిని చంపేస్తూ పాలన ఎలా సాగించారో, రజాకార్లు ఎలాంటి నరహంతుకులో చూపిస్తూ.. సన్నివేశాలను టీజర్లో కట్ చేశారు.
హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమాలో చూపించబోతునట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. వాస్తవాలు ప్రతి ఒక్కరి ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీస్తున్నట్లు మూవీటీమ్ చెబుతోంది.
అయితే, ఈ చిత్రం అనౌన్స్ చేసి పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమాపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లింల మత పెద్దలు ఈ సినిమాపై మండిపడుతున్నారు. కావాలనే రజాకర్లను నరహంతకులుగా చూపిస్తున్నారని అంటున్నారు. కావాలనే 1948లో జరిగిన సంఘటనలను తప్పుగా చిత్రీకరించి రాజకీయ లబ్ది పొందేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యానారాయణ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో నటించారు.