'బ్రో' అనాల్సిన బ్యూటీ 'సామజవరగమన' అయింది!
రెబాకి ఈఛాన్స్ అనుకోకుండా దక్కినట్లు తెలుస్తోంది
'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది బెంగళూరు బ్యూటీ రెబా మోనికా జాన్. తొలి సినిమాతోనే అమ్మడు మంచి విజయం ఖాతాలో వేసుకుంది. అందం..అభినయం అమ్మడికి అదనపు అస్సెట్ గా కలిసోచ్చాయి. నటిగానూ ప్రూవ్ చేసుకుంది. దీంతో అమ్మడు యంగ్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గానూ కనిపిస్తోంది.
అయితే రెబాకి ఈఛాన్స్ అనుకోకుండా దక్కినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్ కి వేరే సినిమా కోసం వచ్చింది. కానీ ఆ సినిమా మిస్ అయినా సామజవరగమనలో ఛాన్స్ అందుకుని అనుకోంకుండా వెలుగులోకి వచ్చేసింది.
ఆ కథేంటే ఆమె మాటల్లోనే.. 'పవన్ కళ్యాణ్..సాయితేజ్ 'బ్రో' సినిమా కోసం నన్ను పిలిపించారు. అప్పుడే నిర్మాత రాకేష్ దండా ఆఫీస్ కి వెళ్లడం అక్కడ రామ్ అబ్బరాజ్ నన్ను చూసి కథ చెప్పారు. నేను ఒకే చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. శ్రీవిష్ణు అంతకు ముందు ఓ సినిమా కోసం నన్ను సంప్రదించారుట. కానీ నేను తెలుగులో నటించడం లేదని ఎవరో చెప్పడంతో ఆగిపోయారుట. కానీ చివరికి విధి ఈ సినిమాలో అవకాశం కల్పించేలా చేసింది.
ఏదో ఒక రోజు పీకే..తేజ్ లతోనూ కలిసి నటిస్తాను..ఆ ఛాన్స్ నాకు వస్తుంది అన్న నమ్మకం ఉంది' అని అన్నారు. అయితే బ్రో కోసం పిలపించి రెబాకి ఎందుకు ఎంపిక చేయలేదు అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. లుక్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతోనే బ్రోలో ఛాన్స్ ఇచ్చి ఉండరు. బ్రో లో హీరోయిన్లగా ప్రియా వారియర్...కేతికశర్మని తీసుకున్నారు. ఈసినిమాకి దర్శకుడు సముద్రఖని అయినా వెనుకండి అంతా నడిపించింది త్రివిక్రమ్.
ఇందులో హీరోల నుంచి హీరోయిన్ల ఎంపిక వరకూ ప్రతీ విషయం గురూజీ దగ్గరుండి చూసుకున్నారు. అలాగే రెబా మోనికాకి త్రివిక్రమ్ అవకాశం ఇవ్వకుండా ఉండరు. తను చేసే ఏదో సినిమాలో ఏదో ఒక రోజు అవకాశం కల్పిస్తారు. నిత్యామీనన్ కి మాటిచ్చినట్లే బెంగుళూరు వచ్చిన బ్యూటీకి గురూజీ ఛాన్స్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటారు.