డైరెక్టర్ ని రిస్క్ లో పెట్టిన ప్రభాస్..?

బాహుబలితో మొదలు పెట్టి కల్కి తో తన రేంజ్ మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్

Update: 2024-07-01 01:30 GMT

బాహుబలితో మొదలు పెట్టి కల్కి తో తన రేంజ్ మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక సినిమాకు 3 ఏళ్లు టైం తీసుకుంటున్నాడు అంటే ఆ సినిమా ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వాలో దానికి మించి లెక్కలతో వస్తున్నాడు ప్రభాస్. కల్కి కోసం నాగ్ అశ్విన్ తో కలిసి దాదాపు 3 ఏళ్లు కలిసి పనిచేశాడు. సినిమా రెండు మూడు సార్లు వాయిద పడినా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న టార్గెట్ తో కల్కి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంబోలా చేస్తున్నారు.

ఐతే ప్రభాస్ సృష్టిస్తున్న ఈ సంచలనాలు అతనితో సినిమా చేయాలని అనుకుంటున్న డైరెక్టర్స్ కి కొంత రిస్క్ ఫ్యాక్టర్ గా మారుతున్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోపక్క సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ కూడా చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా పెండింగ్ లో ఉంది. కల్కితో తారాస్థాయికి వెళ్లిన ప్రభాస్ ఇమేజ్ మళ్లీ రాజా సాబ్ అనే ఒక వెరైటీ టెంప్లేట్ సినిమాతో సర్ ప్రైజ్ చేయనుంది.

ఇక మరోపక్క సందీప్ వంగాతో స్పిరిట్ చేయాలని అనుకోగా ఆ డైరెక్టర్ కి కూడా కొత్త టార్గెట్ ఇచ్చినట్టు అయ్యింది. ప్రభాస్ తో సినిమా అంటే అంత ఈజీ థింగ్ కాదని చెప్పేలా చేశాడు రెబల్ స్టార్. ఐతే సందీప్ వంగ తో సినిమా చేస్తే ఆ హీరో ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ స్టార్ అవ్వగా.. రణ్ బీర్ కపూర్ ఎన్నో సినిమాలు చేసినా యానిమల్ తో అతని రేంజ్ మారిపోయింది. ఇలా తన ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్న సందీప్ వంగ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

స్పిరిట్ కోసం కథ ఆల్రెడీ ఫైనల్ చేసిన సందీప్ వంగ కల్కి చూసిన తర్వాత కచ్చితంగా ఎలివేషన్ సీన్స్ లో మార్పు చేసి ఉంటాడు. ఆకాశమే హద్దు అనేలా ప్రభాస్ క్రేజ్ ఉండగా వాటికి తగినట్టుగానే సీన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. కల్కి తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న ప్రభాస్ రాబోయే సినిమాలతో ఎలాంటి అద్భుతాలు చేస్తాడన్నది చూడాలి.

Tags:    

Similar News