ఆస్కార్స్ వేదికపై `రెడ్ పిన్` వెనక అసలు కథ!
ఆస్కార్స్ 2024 వేదికపై ఒక వింత గురించి ప్రజలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.
ఆస్కార్స్ 2024 వేదికపై ఒక వింత గురించి ప్రజలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ వేదికపై స్టార్ సెలబ్రిటీలు ఎందుకని రెడ్ పిన్ లు ధరించారు? అన్నదే ఆ డిస్కషన్. దీని వెనక మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే....! అసలు సంగతి తెలిసింది..!
సంఘీభావం తెలపడం ద్వారా మారణ హోమాన్ని ఆపడం మానవీయ చర్య. దీనికోసం స్టార్లు ఎంచుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్, మార్క్ రుఫెలో, అవా డువెర్నే, రామీ యూసఫ్ సహా చాలామంది ప్రముఖులు 96వ అకాడమీ అవార్డ్స్‌లో రెడ్ పిన్‌లను బ్లేజర్ కి ధరించి రెడ్ కార్పెట్‌ను అలంకరించారు. ఈ పిన్స్ బ్లాక్ హార్ట్ తో ఉన్న సిల్హౌట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ప్రదర్శన దేనికోసం అంటూ అభిమానులలో ప్రశ్నలు లేవనెత్తాయి రెడ్ పిన్స్.
వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో `పూర్ థింగ్స్` నటుడు రామీ యూసఫ్ దీనిపై ప్రస్థావించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో తక్షణం శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చేందుకే ఈ ప్రదర్శన అని తెలిపారు. పాలస్తీనా ప్రజలకు భద్రత, న్యాయం, శాశ్వత శాంతి ఆవశ్యకతను నొక్కి చెబుతూ గాజాలో శాంతిని కోరుతూ క్రియేటివ్ విభాగం ఇలా చొరవ చూపిందని యూసఫ్ వివరించారు.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆర్టిస్ట్స్ లు కాల్పుల విరమణ కోరుతూ ఈ రెడ్ పిన్‌లను ధరించారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వమని అధ్యక్షుడు బైడెన్‌ను కోరుతూ బహిరంగ లేఖపై సంతకం చేశారు. జెస్సికా చస్టెయిన్, క్వింటా బ్రున్సన్, రిచర్డ్ గేర్, అమెరికా ఫెర్రెరా, కేట్ బ్లాంచెట్, లుపిటా న్యోంగో, మహేర్షలా అలీ ఈ లేఖపై సంతకం చేసారు. ఇజ్రాయెల్ గాజాలో హింసను ఆపడానికి తక్షణ చర్య కోసం లేఖను రాసారు. పవిత్ర భూమిలో జీవితాలను గౌరవించాలని నాయకులను కోరారు. ఇందులో ప్రత్యేకంగా పిల్లలు శరణార్థుల కష్టాలను ప్రస్థావించారు. బాధిత పౌరులను కాపాడాల్సిన అవసరాన్ని లేఖ నొక్కి చెబుతుంది.
తక్షణ మరియు శాశ్వత కాల్పుల విరమణ, బందీలందరి విడుదల , గాజాలోని పౌరులకు అత్యవసరంగా మానవతా సహాయం అందించడం కోసం పిన్ సామూహిక మద్దతును సూచిస్తుందని పేర్కొన్నారు. రెడ్ పిన్స్‌తో పాటు అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ నటులు మిలో మచాడో-గ్రేనర్ -స్వాన్ అర్లాడ్ పాలస్తీనా జెండాను కలిగి ఉన్న పిన్‌లను ధరించారు. ఇంతలో డాల్బీ థియేటర్ వెలుపల అనేక మంది నిరసనకారులు హాలీవుడ్ వీధుల్లోకి వచ్చారు. పాలస్తీనాకు తమ మద్దతును తెలియజేయడానికి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.
ఆస్కార్ వేడుక సాంప్రదాయకంగా చలనచిత్ర పరిశ్రమలో విజయాలను సెలబ్రేట్ చేసుకునే వేదిక. సెలబ్రిటీలు శాంతి కోసం వాదించడానికి కొనసాగుతున్న మానవతా సంక్షోభంపై అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ వేదికను సెలబ్రిటీలు ఉపయోగించుకున్నారు.