150 మంది డాన్స‌ర్లతో సీనియ‌ర్ న‌టి లైవ్ పెర్మార్మెన్స్!

ఐఫా వేడుక అంటే అక్క‌డ క‌చ్చితంగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి రేఖ ప్ర‌ద‌ర్శ‌న ఉండాల్సిందే.

Update: 2024-09-26 17:30 GMT

ఐఫా వేడుక అంటే అక్క‌డ క‌చ్చితంగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి రేఖ ప్ర‌ద‌ర్శ‌న ఉండాల్సిందే. విచ్చేసిన అతిర‌ధ మ‌హార‌ధ‌లంతా ఆమె ప్ర‌ద‌ర్శ‌న వీక్షించి తీరాల్సిందే. క్రమం త‌ప్ప‌కుండా రేఖ అక్క‌డ లైవ్ పెర్పార్మెన్స్ ఇవ్వ‌డం అన్న‌ది ఎంతో కాలంగా అన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 27, 28 తేదీల్లో అబుదాబీ ఐఫా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సెల‌బ్రిటీలంతా దుబాయ్ చేరుకుంటున్నారు.

అబుదాబీ ప్లైట్ లు అన్నీ సెల‌బ్రిటీల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. షూటింగ్ లేని వారంతా రెండు రోజులు ముందుగానే అబుదాబీ చేరుకోగా, బిజీ న‌టులంతా ఒక్కొక్క‌రుగా నేడు రీచ్ అవుతున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా లైవ్ పెర్మార్మెన్స్ కి రేఖ సిద్ద‌మ‌వుతున్నారు. 150 మంది డాన్స‌ర్ల‌తో 22 నిమిషాల పాటు వేదికపై డాన్స్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు.

` ఐఫాకి నా హృద‌యంలో ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్ర‌మే కాదు. క‌ళ , సంస్కృతి, ప్రేమ‌ను సూచిస్తుంది. ప్ర‌తీ ఏడాది ఎంతో గొప్ప‌గా జ‌రిగే ఓ పండుగ ఇది. మీ అంద‌రితో క‌లిసి మ‌ధుర జ్ఞాప‌కాలు పంచుకోవ‌డానికి నేను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.

అంద‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో వేదిక‌పై భార‌తీయ‌త‌ను చాట‌డం నాకు ద‌క్కిన గొప్ప అవ‌కాశంగా భావిస్తాను. దీన్ని ఓ గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ ప్ర‌యాణం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది` అన్నారు. ఈప్ర‌ద‌ర్శ‌న‌లో రేఖ‌...మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన ప్ర‌త్యేక‌మై కాస్ట్యూమ్ ధ‌రించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు షారుక్ ఖాన్, క‌ర‌ణ్ జోహార్, వీక్కీ కౌశ‌ల్ హోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News