గాయ‌ని పెళ్లి ప్ర‌తిపాద‌న‌కు కంగారు ప‌డ్డ ఆర్జీవీ!

ఇక ఆర్జీవీ మొద‌టి పెళ్లి బ్రేక‌ప్ త‌ర్వాత పూర్తిగా, ప్రేమ- పెళ్లి వంటి అంశాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-29 04:15 GMT

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వృత్తిగ‌త, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలపై తెలుగు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న ఉంది. ఆయ‌నంటే ప‌డిచ‌చ్చే డివోటీస్ ఉన్నారు. పిచ్చిగా అభిమానించే గౌర‌వించే శిష్యులు ఆయ‌న కోసం ఉన్నారు. ఇక ఆర్జీవీ మొద‌టి పెళ్లి బ్రేక‌ప్ త‌ర్వాత పూర్తిగా, ప్రేమ- పెళ్లి వంటి అంశాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

పెళ్లిపై ఆర్జీవీ, ఆయ‌న కాంపౌండ్ వ‌ర్గాలు వ్య‌తిరేకం. వివాహ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేద‌ని స్ప‌ష్ఠంగా ప్ర‌క‌టించారు. ఇక ఆర్జీవీ మొద‌టి పెళ్లి బ్రేక‌ప్ త‌ర్వాత చాలా కాలానికి ప్ర‌ముఖ గాయ‌ని పెళ్లికి ప్ర‌పోజ్ చేసార‌నేది తెలిసింది త‌క్కువ‌మందికే. ఇది పాత క‌థే అయినా కానీ, ఆర్జీవీకి ప్ర‌పోజ్ చేసిన‌ ఆ ప్ర‌ముఖ గాయ‌ని ఎవ‌రో తెలుసుకోవాల‌నుకుంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

పాపుల‌ర్ నటి కం గాయని సుచిత్ర కృష్ణమూర్తి 2013 వివాదాస్ప‌ద‌ పుస్తకం `డ్రామా క్వీన్`లో ఆర్జీవీతో త‌న‌ పెళ్లి ప్ర‌పోజ‌ల్ గురించి వివ‌రించారు. సుచిత్ర ఓసారి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ లో ఆయ‌న‌కు చాలా స‌ర‌దాగా ప్ర‌పోజ్ చేసాన‌ని, అయితే అత‌డు కంగారు ప‌డ్డాడ‌ని తెలిపారు. ఓసారి ఆఫీస్ లో క‌లిసిన‌ప్పుడు పెళ్లి గురించి ప్ర‌స్థావించాన‌ని సుచిత్ర పుస్త‌కంలో రాసారు.

``సుచిత్రా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. మేం అస్సలు ఎప్పుడూ ఒకేలా ఉండము. నాకు వివాహ వ్య‌వ‌స్థ‌పై నమ్మకం లేదు. నేను పెళ్లి చేసుకునే వ్యక్తిని కాదు`` అని ఆర్జీవీ అన్నార‌ని సుచిత్ర ఆ పుస్త‌కంలో వివ‌రించారు. సుచిత్ర కృష్ణమూర్తి తాను పుస్తకంలో రాసినది నిజమేన‌ని ఆ త‌ర్వాత టైమ్స్ ఆప్ ఇండియా ఇంట‌ర్వ్యూలో ధృవీకరించారు. ఈ ఇద్దరూ గతంలో మై వైఫ్స్ మర్డర్, ర‌న్ అనే రెండు చిత్రాలకు కలిసి పనిచేశారు. ఆర్జీవీతో జోక్ చేసేంత‌ మంచి స్నేహం ఉంది. తన వివాహ ప్రతిపాదన స‌ర‌దాగా జోక్ చేసిన‌దే అయినా, రామ్ గోపాల్ వర్మ తిరస్కరించార‌ని, అత‌డి అనుమతి తీసుకున్న తర్వాతే త‌న‌ రెస్పాన్స్ గురించి బహిరంగంగా చెప్పానని వెల్లడించారు.

Tags:    

Similar News