బిగ్ బాస్ 8 : ఆర్జీవి సపోర్ట్ సోనియాను కాపాడుతుందా..?

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు.

Update: 2024-09-25 05:14 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అందులో సోనియా ఆకుల కూడా ఉంది. సోనియా ఒక సినీ నటి అంతేకాదు ఆమె ఒక N.G.O ని నడిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఎంట్రీ టైం లో ఆమె గురించి తెలిసిన వారంతా కూడా వావ్ సూపర్ అనుకున్నారు. కానీ హౌస్ లో ఆమె చేస్తున్న పనుల వల్ల బాబోయ్ అనేస్తున్నారు. ఎప్పుడు చూడు నిఖిల్, పృధ్విలను తన వెనక తిప్పుకుంటూ ఆటలు ఆడుతున్న సోనియా మీద ఆడియన్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో సోనియా నబీల్, ఆదిత్య ఓం లతో పాటు యష్మితో కూడా వదన పెట్టుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి వాదనలు చాలా కామన్ కానీ నబీల్, యష్మిల్లు మాట్లాడిన పాయింట్స్, రైజ్ చేసిన విషయాల్లో సోనియా దగ్గర సమాధానం లేదు. ఏదో వాళ్లు మాట్లాడుతున్నారు కాబట్టి ఈమె కూడా మాట్లాడుతుంది కానీ గుడ్ల టాస్క్ లో ఆమె పృధ్విని రెచ్చగొట్టిందని ఆడియన్స్ కూడా గమనించారు. అదే విషయాన్ని నబీల్, యష్మి గట్టిగా చెప్పారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం లీస్ట్ ఓటింగ్ లో సోనియానే వెనకపడి ఉంది.

దాదాపు ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటున్నారు. ఐతే ఈ టైం లో ఆమెను సపోర్ట్ చేస్తూ సంచలన దర్శకుడు ఆర్జీవి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సోనియా తనతో దిగిన ఫోటోని షేర్ చేసిన ఆర్జీవి యాటిట్యూడ్ కి, ధైర్యానికి నిదర్శనం అయిన సోనియా బిగ్ బాస్ లో బాగా ఆడుతుంది. మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయాలని ఆడియన్స్ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు ఆర్జీవి. ఐతే గత వారంతో పాటి ఈసారి నామినేషన్స్ చూశాక ఆడియన్స్ అందరు కావాలని సోనియాని పంపించాలని డిసైడ్ అయ్యారు.

మరి ఆర్జీవి సపోర్ట్ చేయమని అడిగాడు కాబట్టి ఆమెకు ఈ మూడు రోజులు ఏమైనా ఓట్లు పడతాయా ఆర్జీవి సపోర్ట్ ఆమెను బయటకు రాకుండా కాపాడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. మంగళవారం ఎపిసోడ్ లో యష్మితో సోనియా గొడవ ఆమెను మరింత బ్యాడ్ అయ్యేలా చేసింది. మరి ఈ వీకెండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలియాలంటే ఆరోజు వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News