సైకిలు- టీ గ్లాసుతో.. ఆర్జీవీ ఎక‌సెక్క‌మేంటి?

ఇంత‌కీ ఆ సైకిలేంటి? ఆ గ్లాస్ తో ఆ ఫోజేంటి? ఆ వెన‌క యానిమ‌ల్ క‌థాక‌మామీషు ఏమిటి? అంటే ఆర్జీవీనే దీనికి స‌మాధానం ఇవ్వాలి.

Update: 2023-12-15 03:52 GMT

అవును.. ఆర్జీవీ ఏసేశాడు? మ‌ళ్లీ చెల‌రేగి పంచ్ ఏసేశాడు! సైకిలు- టీగ్లాసు అత‌డి టార్గెట్ గా మారాయి. ఇంత‌కుముందే వ్యూహం సెన్సార్ ఫార్మాలిటీస్ ని ముగించి, రిలీజ్ తేదీని కూడా ప్ర‌క‌టించేసిన రామ్ గోపాల్ వ‌ర్మ త‌న గెలుపును స‌గ‌ర్వంగా చాటుకున్నాడు. వ్యూహం ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 29న ఘ‌నంగా విడుద‌లైపోతోంది. ఈ చిత్రాన్ని దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.


అన్న‌ట్టు ప‌సుపు రంగు వేసుకున్న సైకిలుతో ఆఫ్ క‌ప్ టీ గ్లాసు ప‌ట్టుకుని ఆర్జీవీ ఆ ఫోజ్ ఏంటో కానీ, అత‌డి వెన‌కే ఒక భారీ చింపాంజీని కూడా చూపించాడు. ఇంత‌కీ ఆ సైకిలేంటి? ఆ గ్లాస్ తో ఆ ఫోజేంటి? ఆ వెన‌క యానిమ‌ల్ క‌థాక‌మామీషు ఏమిటి? అంటే ఆర్జీవీనే దీనికి స‌మాధానం ఇవ్వాలి.

నా వెనుక ఉన్న యానిమ‌ల్‌కు చీర్స్ అంటూ ఆర్జీవీ టీ గ్లాస్ తో చీర్స్ చేసాడ‌న్న‌మాట‌. ఇదంతా ప‌సుపు రంగు సైకిల్ ముందు అత‌డి ఎక‌సెక్కమా? అంటూ ఒక అభిమాని స్పందిస్తూ త‌న ఒపీనియ‌న్ చెప్పాడు. "జనసేన.. టిడిపి.. ఈ రెండు పార్టీలను తక్కువ చూపించి వైసీపీ నీ లేపి తీసాడు ఈ సినిమా.. కోపం ఉంటే కొట్టు మావా.. ఇలా సినిమా తీసి నొప్పించకు.. ఏంటో నువ్వంటే పిచ్చి.. పీ.ఎస్.పి.కే అంటే ప్రాణం.. నీకోసం సినిమా చూడాలి.. పీఎస్‌పికే కోసం ఏడవాలి" అని వ్యాఖ్యానించాడు.

ఈ సినిమా ఇతివృత్తం ఏంటంటే "సొసైటీని అలా కోపంగా చూడకు, బాస్ అవ్వాలంటే సైకిల్ షాప్ కానీ..టీ షాప్ కానీ పెట్టుకో.. లేకుంటే నీ చెవిలో పువ్వులు పెడతారు.." అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు.

నీకు సినిమాలు తీయడం కూడా వచ్చా ఆర్జీవీ గారు? మీకన్నా మా ఊర్లో యూట్యూబ్ వీడియోలు చేసే పోరగాళ్లు అద్భుతంగా చేస్తున్నారు.. అని ఒక ఫ్యాన్ ఘాటైన కామెంట్ చేసారు.

ఆ వెన‌కాల ..జగన్ ఫోటో అలా ఉందీ ... అని ఒక అభిమాని రాసారు. సైకిల్ బానే రిపేర్ చేసావ్ అంటూ స్మైల్ ఈమోజీని ఒక అభిమాని షేర్ చేసాడు. సైకిల్, గాజు గుర్తుకి ఓటు వేస్తే చెవిలో పువ్వులు పెడతారు అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

మీ అయ్య ఫోటో నా వెనకాల? అని ఒకరు వ్యాఖ్యానించ‌గా, బ్యాక్ సైడ్ జగన్ మావయ్యలా వున్నాడు ఏంటి? అని ఒక‌రు వ్యాఖ్యానించారు. మ‌రొక‌రు ఇలా రాసారు. "సినిమాటిక్ గా చెప్పాలంటే...ఆ కింగ్ కాంగ్ ని ఆపాలంటే మొత్తం ఆర్మీ వెపన్స్ తో దిగినా ఆపల్లేరు....పెద్ద పెద్ద బిల్డింగ్లే ..సంకనాకి పోతాయ్..ఇలాంటివి (సైకిల్- గ్లాస్ ఫ్లవర్)ఎక్కడడ్డుకుంటాయ్ అని అర్దం! నాకు క్లారిటీ లేదు..ఊహించండి...అని ఒక‌రు వ్యాఖ్యానించారు. మొత్తానికి వ్యూహానికి ఆర్జీవీ ఏదో ఒక ర‌కంగా మైలేజ్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫ‌న్ లోంచి ఫైర్ పుట్టిస్తున్నారు.

Tags:    

Similar News