'వ్యూహం'.. జగన్ కూడా టికెట్ కొనే చూడాలి..
ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు ఆర్జీవి. ఈ ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసిన అది సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. గత కొంతకాలంగా ఈయన తన సినిమాలతోనే నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. ఇక త్వరలోనే మరో రెండు సినిమాలతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై రాంగోపాల్ వర్మ రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మొదటి భాగానికి 'వ్యూహం' అనే టైటిల్ పెడితే రెండో భాగం 'శపథం' పేరుతో విడుదల కాబోతోంది. వీటిలో 'వ్యూహం' ఈ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. రీసెంట్ గాని ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. వ్యూహం మూవీకి సెన్సార్ యూనిట్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆర్జీవి సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. తాజాగా వ్యూహం సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు ఆర్జీవి. ఈ ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యూహం సినిమా గురించి అర్జీవీ మాట్లాడుతూ.." అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని గతంలోనే చెప్పాను. సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఏం మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారని నన్ను మాత్రం అడగవద్దు. ఏపీ సీఎంతో నాకు పరిచయం లేదు. వైయస్సార్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనే కథే ఈ వ్యూహం సినిమా.
ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాం. గతంలో బయట వాళ్ళు మైక్స్ దగ్గర ఏమి చెప్పారో అదే ప్రజలకు తెలుసు. కానీ వాళ్ల బెడ్ రూమ్, బాత్ రూమ్ విషయాలు చూపించాను. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ క్యారెక్టర్సే. నేనేం చూపించాను అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వ్యూహం సినిమాను వైయస్ జగన్ కూడా టికెట్ కొనే చూడాలి. చంద్రబాబుకు మాత్రం ఉచితంగానే చూపిస్తాం" అని చెప్పుకొచ్చాడు ఆర్జీవి.
దీంతో ఆర్జీవి చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమాలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్ అమీర్ వైయస్ జగన్ పాత్రను పోషిస్తుండగా.. ఆయన సతీమణి వైయస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.