బ్యాడ్ గయ్స్కి ఆర్జీవీ చెప్పిన బ్యాడ్ న్యూస్!
అయితే బ్యాడ్ గయ్స్ కి ఇది బ్యాడ్ న్యూస్. గుడ్ గయ్స్ కి గుడ్ న్యూస్. ఆర్జీవీ సినిమా వ్యూహంను రిలీజ్ కానీకుండా నిలువరించిన బ్యాడ్ గయ్స్ అందరికీ ఇది కచ్ఛితంగా బ్యాడ్ న్యూస్.
అవును.. ఆర్జీవీ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. అయితే బ్యాడ్ గయ్స్ కి ఇది బ్యాడ్ న్యూస్. గుడ్ గయ్స్ కి గుడ్ న్యూస్. ఆర్జీవీ సినిమా వ్యూహంను రిలీజ్ కానీకుండా నిలువరించిన బ్యాడ్ గయ్స్ అందరికీ ఇది కచ్ఛితంగా బ్యాడ్ న్యూస్. థియేటర్లకు వచ్చి సినిమాని ఆదరించేవారంతా ఆర్జీవీ దృష్టిలో గుడ్ గయ్స్. ఇంతకీ మీరు బ్యాడ్ గయ్స్ జాబితాలో ఉంటారా? లేక గుడ్ గయ్స్ జాబితాలో ఉంటారా? నిర్ణయించుకోండి.
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం 'వ్యూహం'. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. ఇందులో నిజజీవిత పాత్రధారులను యథాతథంగా చూపించారంటూ అభ్యంతరం వ్యక్తమైంది.
నిజానికి ఈ అభ్యంతరం సినిమాపై ఆసక్తిని పెంచింది. అప్పటినుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో 'వ్యూహం' సినిమా గురించి ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తానికి రీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన తన ఎక్స్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.
చెడ్డ కుర్రాళ్లకు చెడ్డ న్యూస్ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్తో తన ఫోటోను జత చేశారు ఆర్జీవి. ఈ ఫోటోలో సినిమా రెండుగంటల ఆరు నిమిషాలు నిడివి ఉన్న 'వ్యూహం' సినిమాకు యూ సర్టిఫికెట్‌ను కేటాయించింది సెన్సార్‌బోర్డు. రామధూత క్రియేషన్స్ పతాకంపై ఈ దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.