ఫోటో స్టోరి: రియా క్యూట్‌నెస్ ఓవ‌ర్ లోడెడ్

క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్‌లో. మ‌త్తెక్కించే అందాల్ని పాక్షికంగా ఎలివేట్ చేసే ఫ్రాక్ ని ధ‌రించిన రియా దానికి కాంబినేష‌న్ స్వెట్ ష‌ర్ట్ ని ధ‌రించింది.

Update: 2024-07-20 14:30 GMT

రాజకుటుంబానికి చెందిన నటి.. క్యూట్ లుక్స్ అంద‌మైన క‌ళ్ల‌తో హృద‌యాల‌ను గెలుచుకుంది. ఒకప్పుడు వ‌రుస చిత్రాల్లో న‌టించింది.. ఆరంభం మంచి హిట్లు అందుకుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, బెంగాళీలో న‌టించింది. కానీ ఒకానొక ద‌శ‌లో ఆశించిన విజ‌యాలు ద‌క్క‌క‌పోవ‌డంతో న‌టిగా ఎదుగుద‌ల క‌నిపించ‌లేదు. ఇన్నేళ్లుగా న‌టించినా కానీ ఆశించిన హిట్లు లేవు. అడ‌పాద‌డపా అవ‌కాశాలున్నా ఏవీ క‌లిసి రావడం లేదు. కొంత గ్యాప్ త‌ర్వాత పున‌రాగ‌మ‌నంలో సినిమాలు చేస్తున్నా కానీ ఇంకా ఆశించిన బ్రేక్ రాలేదు.

 

ఇదంతా బాలీవుడ్ క్యూటెస్ట్ హీరోయిన్ రియా సేన్ గురించే. రియా తెలుగులో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న `నేను మీకు తెలుసా?` అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సాంకేతికంగా అద్భుతంగా ఉన్నా కంటెంట్ ప‌రంగా నిరాశ‌ప‌రిచింది. ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కానీ రియా నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. త‌ను షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

తాజా ఫోటోగ్రాఫ్‌లో రియా క్యూట్ నెస్.. అదే అంద‌మైన‌ రూపం అభిమానుల గుండెల్ని హ‌త్తుకున్నాయి. క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తోంది ఈ ఫోటోగ్రాఫ్‌లో. మ‌త్తెక్కించే అందాల్ని పాక్షికంగా ఎలివేట్ చేసే ఫ్రాక్ ని ధ‌రించిన రియా దానికి కాంబినేష‌న్ స్వెట్ ష‌ర్ట్ ని ధ‌రించింది. క్రీగంటి చూపుల‌తో కుర్ర‌కారు హృద‌యాల్ని గిల్లుతోంది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇన్ స్టాలో త‌న లేటెస్ట్ మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసిన రియా ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``ఒక చిన్న కదలిక చాలా దూరం వెళుతుంది! వ్యాయామం శరీరానికే కాదు, మనసుకు కూడా ఉత్తేజాన్నిస్తుంది. నా శిక్షకుడు నన్ను తీర్చిదిద్ద‌డంతో తిరిగి అదే రేపానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది! అని రియా వ్యాఖ్య‌ను జోడించింది.

లెజెండ‌రీ న‌టి మ‌న‌వ‌రాలు:

రియా సేన్ ప్రముఖ న‌టి మూన్ మూన్ సేన్ కుమార్తె. సినీ లెజెండ్ సుచిత్రా సేన్ మనవరాలు. సినిమా కుటుంబంలోని ఆమె తల్లి వైపు నుండి న‌టిగా జీన్స్ వచ్చినప్పటికీ, రియా తండ్రి వైపు నుండి చూస్తే రాజవంశస్థురాలు. రియా తండ్రి భరత్ దేవ్ వర్మ బరోడా -యు జైపూర్ పాలక కుటుంబాలతో సంబంధాలు కలిగి ఉన్న త్రిపురకు చెందిన‌ పూర్వపు రాజకుటుంబానికి చెందినవారు. న‌ట‌నా రంగం - పాల‌నా రంగాల‌తో సంబంధం ఉన్న అమ్మాయి రియా. 1991లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన తర్వాత రియా 1999లో తాజ్ మహల్‌తో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఆరంగేట్ర‌మే అద్భుతమైన పాత్రతో 2001 స్లీపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో దిల్ విల్ ప్యార్ వ్యార్, ఖయామత్, ఝంకార్ బీట్స్ స‌హా మరిన్ని మంచి సినిమాలతో విజయాలు సాధించింది.

2006- 2013 మధ్య రియా హిందీ, బెంగాలీ, తెలుగు, ఒడియా భాషలలో 15 చిత్రాలకు పైగా పనిచేసింది. అయితే వాటిలో ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాలేదు. 2016లో హీరో 420, డార్క్ చాక్లెట్‌లలో కనిపించింది. అప్పటి నుంచి రియా ఏ చిత్రానికి సంతకం చేయలేదు. 2022లో చాలా కాలంగా ఆలస్యమైన చిత్రం `లవ్ యు హమేషా` విడుదలైంది. అదే ఆమె చివరి విడుదలగా మిగిలిపోయింది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల‌లోను న‌టించింది. 2017లో రాగిణి MMS రిటర్న్స్‌లో అతిధి పాత్రతో OTT అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె పాయిజన్, మిస్‌మ్యాచ్ 2 , బెకాబూలో కనిపించింది. కానీ ఏవీ త‌న స్టార్ డ‌మ్ ని పెంచ‌లేదు. ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించ‌లేదు.

Tags:    

Similar News