దీపికా పదుకొణేకి మద్దతుగా మరో గర్భవతి!
నెలలు నిండుతోన్న సమయంలో `కల్కి 2898` ఈవెంట్ కోసం దీపికా పదుకొణే హైహీల్స్ ధరించడంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
నెలలు నిండుతోన్న సమయంలో `కల్కి 2898` ఈవెంట్ కోసం దీపికా పదుకొణే హైహీల్స్ ధరించడంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో బేబి బంప్ లుక్..హైహీల్స్ తో అభిమా నుల్ని సర్ ప్రైజ్ చేసినప్పటికీ స్పాట్ లో దీపిక అసౌకర్యానికి గురికావడం అంతా గమనించారు. సీటులో కూర్చుని లేచే సమయంలో ఎంతో ఇబ్బంది పడింది.
అక్కడ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెదిక మెట్లు ఎక్కే సమయంలో అమితాబచ్చన్, ప్రభాస్ చేతులు అందుకుని సహకారంతో మెట్లు ఎక్కింది. ఆ సమయంలో కిందన నల్లటి మ్యాట్ కూడా ఉంది. కాళ్లకు ధరించిన పెన్సిల్ హిల్స్ చూసి మరింత ఆందోళన పడ్డారు అభిమానులు. మామూలు హీల్స్ తో నడవడమే కష్టమైన పని. కానీ దీపిక మాత్రం ఏకంగా పెన్సిల్ హిల్స్ ధరించడం అంతటా చర్చకొచ్చింది. మ్యాట్ పై ఎక్కడా కాలు స్కిడ్ అవుతుందోనని భయడప్డారు.
దీంతో దీపికా పదుకొణే చిన్నపాటి ట్రోలింగ్ కూడా ఎదుర్కుంది. ఇలాంటి సమయంలో శరీరానికి సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. కాళ్లకు ధరించే చెప్పులు కూడా ఎంతో సౌకర్యంగా ఉండాలి. ఎలాంటి కుదుపుకు లొనయ్యే విధంగా ఉండకూడదు అని ఎవరికి తోచిన సలహాలు వారు సోషల్ మీడియాలో ద్వారా ఇచ్చారు. అయితే ఓ ఇన్ ప్యూయన్సెర్ దీపికకు పూర్తిగా మద్దతిచ్చారు.
ఆమె ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలాంటి చెప్పులు వేసుకోవాలి? అని చెప్పడానికి చిన్నపిల్ల కాదని దీపిక తన సౌలభ్యం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని, ఆమెకు ఎవరి సూచన అవసరం లేదని రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యల్ని మరో గర్బవతి అయిన రిచా చద్దా కూడా మద్దతిచ్చింది. `గర్భాశయం లేదు, అభిప్రాయం లేదు`` అని తెలిపింది.