అంబానీ పెళ్లిలో ఏమిటీ వింత.. చిరిగిన గౌనుతో రిహాన్న!
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ కాక్టెయిల్ పార్టీలో చిరిగిన దుస్తులతో రిహన్నా కనిపించడంతో ఇప్పుడు ప్రపంచమంతా షాక్ లో ఉంది
అంబానీ పెళ్లిలో ఏమిటీ వింత? అవును.. అంబానీ పెళ్లిలో వింత వింతలు బయటపడుతున్నాయి. ఏకంగా చిరిగిపోయిన జాకెట్ తో కనిపించింది పాప్ స్టార్ రిహాన్న. వచ్చేప్పుడు ఒక రేంజులో మడతపెట్టిన ఇల్లు లాంటి లగేజీతో ముంబై విమానాశ్రయంలో దిగిన రిహన్నా చినిగిపోయిన దుస్తులు తెచ్చుకుందా? ఇదెక్కడి వింత.. ఎట్టెట్టా! అంటూ ప్రస్తుతం నెటిజనుల్లో డిబేట్ సాగుతోంది.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ కాక్టెయిల్ పార్టీలో చిరిగిన దుస్తులతో రిహన్నా కనిపించడంతో ఇప్పుడు ప్రపంచమంతా షాక్ లో ఉంది. ఈ ప్రీవెడ్డింగ్ కోసమే అంబానీలు ఏకంగా 1000 కోట్లు ధారపోసినట్టు కనిపిస్తోంది. పెళ్లి ఇంకా అవ్వాల్సి ఉంది. అంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారో ఊహించుకోవాలి.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహాన్న ప్రదర్శన కోసమే అంబానీలు ఏకంగా 70 కోట్ల పారితోషికాన్ని చెల్లించారు. వ్యాపార దిగ్గజం కుటుంబ సభ్యులు సెలబ్రిటీల కోసం గ్రాండ్ కాక్టెయిల్ పార్టీని నిర్వహించగా ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. ఈ వేడుకలో రిహాన్న ప్రదర్శన ప్రధాన హైలైట్. బాలీవుడ్ యువనటి జాన్వీ కపూర్‌తో కలిసి రిహన్న `జింగత్` ప్రదర్శన ఈ పార్టీలో హైలైట్ గా నిలిచింది. జింగ్ జింగ్ జిగాత్ అంటూ రిహన్న మైమమరిచి నాట్యమాడింది. తన నాట్యంలో నాగిని నృత్యం అహూతులను రంజింపజేసింది. అయితే ఇక్కడే ఒక విచిత్రం బయటపడింది.
రిహానా ధరించిన లైట్ గ్రీన్ పారదర్శక దుస్తులు చిరిగిపోయి కనిపించాయి. అది కూడా రిహానా చేతిని పైకి ఎత్తి జోష్ లో ఉండగా చంకలో చినిగిపోయి కనిపించింది. ఇప్పుడు హిందీ మీడియాలు ఆ భాగాన్ని రౌండప్ చేసిన మార్కింగుతో ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తూ రిహాన్నా డ్రెస్ చిరిగిపోయిందంటూ ప్రచారం చేస్తున్నాయి. వార్డ్ రోబ్ మల్ ఫంక్షన్ వార్తలను ప్రచారం చేస్తున్నాయి.
భాయ్ చెప్పిన రిహాన్న:
రిహన్న ఈవెంట్లో తన ఫేవరెట్ సాంగ్స్ కి ప్రదర్శన ఇచ్చింది. వీటిలో పోర్ ఇట్ అప్, డైమండ్స్, వైల్డ్ థింగ్స్ వంటి పాటల్లో రిహన్న పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. ఇక ఈవెంట్ అనంతరం రిహన్న భారతదేశానికి వీడ్కోలు పలికే ముందు జామ్‌నగర్ విమానాశ్రయంలో ఇద్దరు మహిళా పోలీసు అధికారులను కౌగిలించుకుని వారి బృందంతో ఫోటోలు దిగింది. అయితే ఈవెంట్లో రిహన్నా చిరిగిన దుస్తుల ఫోటో వైరల్‌గా మారింది. ఆమె వార్డ్రోబ్ సమస్యను ఎదుర్కొన్నారా? అంటూ చర్చకు దారి తీసింది. రిహన్నా వేదికపై నీతా అంబానీ - అనంత్ అంబానీతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం పోజులివ్వడం ఇవన్నీ ఉన్న ఫోటోల బంచ్ లో చిరిగిన టాప్ ఫోటో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మీడియా ఫ్యాన్స్ తమ డేగ కళ్లతో దీనిని గమనించి వైరల్ గా ప్రచారం చేస్తున్నారు.
అంత ఖరీదైన ఈవెంట్ కోసం రిహన్న చినిగిర దుస్తులను మోసుకొచ్చిందా? అంటూ కొందరు సెటైర్లు వేస్తుండగా, చక్కనమ్మ చింపుకుని వచ్చినా ఫ్యాషనే! అంటూ చాలా మంది తనను సమర్థిస్తున్నారు.