భార్య భ‌ర్త‌ల మ‌ధ్య‌ రొమాంటిక్ విషెస్!

దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీఫా ఎత్తైన ట‌వ‌ర్ ముందు గ్రాండ్ గా న్యూ ఇయ‌ర్ కి వెల్క‌మ్ చెప్పారు.

Update: 2025-01-01 16:05 GMT

న‌య‌న‌తార‌-విగ్నేష్ శివ‌న్ ల మ‌ధ్య అన్యోన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వెకేష‌న్ అయినా..పెస్టివల్ అయినా? త‌మ‌దైన శైలిలో ఆస్వాదిస్తారు. పండ‌గొస్తే ఆయా సంప్ర‌దాయాల్లో ఒదిగిపోతారు. వెకేష‌న్ అయితే? ఆ మోడ్ లోనూ అంతే ఆస్వాదిస్తారు. తాజాగా దంప‌తులిద్ద‌రు కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పారు. దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీఫా ఎత్తైన ట‌వ‌ర్ ముందు గ్రాండ్ గా న్యూ ఇయ‌ర్ కి వెల్క‌మ్ చెప్పారు.


తాజాగా ఇన్ స్టాలో ఓ ఫోటో వైర‌ల్ అవుతుంది. అందులో ఇద్ద‌రు రొమాంటిక్ గా న్యూ ఇయ‌ర్ విషెస్ ఒక‌రికొక‌రు చెప్పుకున్నారు. నెటి జ‌నులకు ఓ అద్భుత‌మై కొటేష‌న్ కూడా వ‌దిలారు. 'ఎక్కడ ప్రేమ ఉంటుందో? అక్కడ ఆనందం ఉంటుంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని రాసుకొచ్చారు. ఇంకా విగ్నేష్ ఇలా రాసుకొచ్చారు. 'ప్రేమపై దృష్టి పెట్టండి. జీవితంలోని మంచి అనుకునే ప్ర‌తీ అంశంపై వ‌దిలి పెట్ట‌కుండా ప‌నిచేయండి.

క‌ష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ప‌ని చేయండి. పాజిటివ్ అంశాలే మ‌న‌సులోకి రానివ్వండి. ప్ర‌తీ కూల అంశాల‌కు దూరంగా ఉండండి. ఇమే విజ‌యాన్ని, మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను అందిస్తాయి. 2025 మీరు కోరుకున్నవన్నీ అంద జేస్తుంది' అని రాసుకొచ్చారు. న‌యన్-విగ్నేష్ ఫోటో విష‌యానికి వ‌స్తే? ఇద్ద‌రు ఒక‌ర్ని ఒక‌రు హ‌త్తుకుని , ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటూ స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సుతో విషెస్ చెప్పుకున్నారు.

ఆ ఫోటోలో ఎంతో రొమాంటిక్ కోణం ఉంది. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నెటి జ‌నుల్ని ఆక‌ర్షిస్తుంది. ఇదే స్పాట్ వ‌ద్ద మాధ‌వ‌న్- సరితా బిర్జేతో దంప‌తులు కూడా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా చాలా మంది సెల‌బ్రిటీలు బూర్జ్ ఖ‌లీఫా వ‌ద్దనే కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్క‌మ్ ప‌లికారు.

Tags:    

Similar News