పరాయి దేశంలో 'ఆర్ఆర్‌ఆర్' కంటిన్యూగా 91 వారాలు!
91 వారాలుగా కంటిన్యూగా ఆ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రన్ అవుతోంది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు దక్కని అరుదైన రికార్డ్‌గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొంది 24 మార్చ్ 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి ప్రతిభకి మరో నిదర్శనం అన్నట్లుగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇండియన్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రేక్షకులను సైతం మైమరపించింది. ముఖ్యంగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం జరిగింది. అంతే కాకుండా ఆ దేశంలోని ఒక థియేటర్‌లో ఇప్పటికీ నడుస్తూనే ఉంది. 91 వారాలుగా కంటిన్యూగా ఆ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రన్ అవుతోంది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకు దక్కని అరుదైన రికార్డ్‌గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఒక భారతీయ సినిమా జపాన్‌లో ఈ స్థాయిలో ఆడటం మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్‌లో నెల రోజులు ఉండటం గగనంగా మారింది. వంద రోజులు ఉంది అంటే గొప్ప విషయం. అలాంటిది ఈ సినిమా ఏకంగా 21 నెలలుగా కంటిన్యూగా ఒకే థియేటర్‌లో కొనసాగుతోంది. ఈ వారం అక్కడ ఆర్ఆర్‌ఆర్ కి చివరి వారం. ఈ విషయాన్ని సదరు థియేటర్ వారు అధికారికంగా ప్రకటించి సోషల్ మీడియా ద్వారా పోస్టర్ ను షేర్ చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్ సినీ ప్రముఖులు సైతం ఈ రేర్ రికార్డ్ కి ఫిదా అవుతూ ఉంటారు.
జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా 21 నెలలు ఆడింది ఏదో సాదా సీదా థియేటర్‌లో కానే కాదు. అది ఒక చారిత్రాత్మక థియేటర్ గా స్థానికులు చెబుతున్నారు. అక్కడ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఏడాది పాటు అక్కడ సినిమా ఆడటం చాలా గొప్ప విషయం. అలాంటిది ఏకంగా సంవత్సరం దాటిన తర్వాత 9 నెలలుగా కొనసాగుతూనే ఉంది. జపాన్ లో రాజమౌళి సినిమాలకు మంచి స్పందన ఉంది. కనుక ఈ సినిమాను అక్కడి వారు రిలీజ్ చేయడానికి పోటీ పడ్డారు. అనుకున్నట్లుగానే రాజమౌళి మరోసారి గట్టిగానే జపాన్‌లో హిట్ కొట్టి తన సత్తా చాటారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు సైతం జపాన్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సైతం అత్యధిక వసూళ్లు నమోదు కావడంతో పాటు ఏకంగా ఒక థియేటర్ లో 91 వారాలు కంటిన్యూగా ఉండటం వల్ల ప్రపంచ సినీ ప్రముఖులు అంతా ఇండియన్ మూవీ అది మన తెలుగు సినిమా వైపు చూసేలా రాజమౌళి చేశారు. వచ్చే వారంతో ఆ థియేటర్ నుంచి ఆర్ఆర్‌ఆర్ ను తొలగిస్తున్న నేపథ్యంలో ఈ వారం రోజులు అత్యధిక వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది