టైటానిక్ సరసన ఆర్ ఆర్ ఆర్ ఎలా సాధ్యమంటే?
సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు రూపొందించే స్టంట్ మాస్టర్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ డాల్బీ థియేటర్లో ఓ వీడియోని ప్రదర్శించారు.
'టైటానిక్'..'మిషన్ ఇంపాజిబుల్'..' జాన్విక్'..'ది మ్యాట్రిక్స్'..'హరాల్డ్ లాయిడ్' లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రాల సరసన భారతీయ చిత్రం..తెలుగు సినిమా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది అన్న సంగతి ఎంత మంది కి తెలుసు? ఆస్కార్ అవార్డు అందుకున్నా మళ్లీ ఆస్కార్ పై ఆర్ ఆర్ ఆర్ నిలిచింది? అన్నది ఎంత మంది గుర్తించారు? అవును ఆస్కార్ గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లోనూ తళుక్కు మంది.
సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు రూపొందించే స్టంట్ మాస్టర్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ డాల్బీ థియేటర్లో ఓ వీడియోని ప్రదర్శించారు. అందులో చార్లీ చాప్లిన్ నటించిన 'హరాల్డ్ లాయిడ్'.. 'టైటానిక్' ఇంకా పైన చెప్పిన సినిమాలన్నింటితో పాటు 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం కూడా ఉంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా లోని యాక్షన్ సన్నివేశాల్ని కూడా ఈ వీడియోలో జత చేయడం విశేషం. ఇంకా విక్ డ్ విభాగంలోని 'ఆర్ ఆర్ ఆర్' లోని 'నాటు నాటు' పాటని కూడా ప్రదర్శించారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ కి మరోసారి ఆస్కార్ వేదికపై ఆరుదైన గౌరవం దక్కినట్లు అయింది.
ఇంతవరకూ ఏ భారతీయ సినిమాకి ఈ అవకాశం రాలేదు. కేవలం నామిషన్ల వరకూ వెళ్లి వెనక్కి రావడం తప్ప ఇంతటి గొప్ప స్థానం ఏ సినిమాకి దక్కలేదు. గత ఏడాది ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు మరుసటి ఏడాది కూడా ప్రదర్శించడం అంటే సామాన్య విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆసినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే తప్ప సాధ్యం కానిది. ఆస్కార్ అవార్డు కంటే ముందే 'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో సంచలనమైంది.
ఓటీటీ ద్వారా పాన్ వరల్డ్ లో 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ సాధించంతోనే ఇది సాధ్యమైంది. అలాగే హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జెమ్స్ కామెరాన్ లాంటి వాళ్లు 'ఆర్ ఆర్ ఆర్' ని ఆకాశానికి ఎత్తడం కూడా ఈ ఖ్యాతికి కారణమైంది. ఈ సందర్భంగా 'ఆర్ ఆర్ ఆర్' బృందం సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచంలోని గొప్ప చిత్రాల సరసన 'ఆర్ ఆర్ ఆర్' ని చేర్చడంపై సర్వత్రా సంతోషం వ్యక్తం చేసి గర్వించారు.