పాలకోవా అందంతో ఊరిస్తున్నా ఛాన్సులేవీ?

అందాల రాణి రూహీ సింగ్ గురించే ఇదంతా. ఈ టాప్ మోడ‌ల్ మ‌ధుర్ భండార్క‌ర్ 'క్యాలెండర్ గర్ల్స్‌'తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది.

Update: 2024-06-24 04:21 GMT

ఈ బ్యూటీ మోడలింగ్ కెరీర్‌తో అంతర్జాతీయ వినోద పరిశ్రమలోకి ప్రవేశించింది. ఈ రంగంలో వేగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు, ఫోటోగ్రాఫర్‌ల దృష్టిని ఆకర్షించింది. అద్భుతమైన అందం, ప్రశాంతత, తేజస్సుతో పాటు, ప్రతిష్టాత్మక వీకెండ్ క్యాట్‌వాక్‌లతో.. హై-ఫ్యాషన్ మ్యాగజైన్‌ల ఫోటోషూట్ల‌లో అనేక అవకాశాలను అందుకుంది. న‌టిగా బాలీవుడ్ లో త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తోంది.. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? అంటే...!

 

అందాల రాణి రూహీ సింగ్ గురించే ఇదంతా. ఈ టాప్ మోడ‌ల్ మ‌ధుర్ భండార్క‌ర్ 'క్యాలెండర్ గర్ల్స్‌'తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి ప్ర‌య‌త్న‌మే విమర్శకుల ప్రశంసలు పొందింది. న‌టిగా మోడ‌ల్ గా అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ పరిశ్రమ సంక్లిష్టతలను అర్థం చేసుకుని యువ మోడల్‌గా బలవంతపు ఫోటోషూట్లు ఎలా చేయాల్సి వ‌స్తుందో తొలి సినిమాలో న‌టించి చూపించింది. ఈ పాత్ర మంచి గుర్తింపును సంపాదించింది. అప్పటి నుండి రూహీ తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. ప‌లు అంతర్జాతీయ ప్రాజెక్టులలో సవాల్ అనిపించే పాత్రలను పోషిస్తోంది.

 

ఎమ్మీకి నామినేట్ అయిన డాక్యుమెంటరీ 'ది వరల్డ్ బిఫోర్ హర్‌'లో కనిపించింది. నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ సిరీస్- సోషల్ కరెన్సీలో కూడా న‌టించింది. ఇండీ చిత్రాల నుండి ప్రధాన స్రవంతి హాలీవుడ్ షోల వ‌ర‌కూ...నటిగా తన బహుముఖ ప్రజ్ఞ తో పరిధిని విస్త‌రించుకుంది. తాను న‌టించే పాత్రలకు డెప్త్ తో పాటు ప్రామాణికతను తీసుకురాగల సామర్థ్యం ఉన్న న‌టి అని ప్రశంసలు అందుకుంది. అలాగే రూహీకి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే హ్యాబిట్ ఉంది. దాంతో పాటు కింగ్ ఫిష‌ర్ గాళ్ గా విదేశాల‌లో గౌరవం ఉంది. అంతర్జాతీయ మోడలింగ్ ఏజెన్సీలు, సంస్థలతో కలిసి పనిచేయ‌డానికి ఇది దారులు తెరిచింది.

 

రూహీ సింగ్ ఇంత‌కుముందు మంచు కాంపౌండ్ లోను ఓ చిత్రంలో న‌టించింది. మోస‌గాళ్లు అనేది టైటిల్. ఈ మూవీ తో అంత‌గా గుర్తింపు రాక‌పోయినా కానీ తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కు ఇది ఆరంగేట్రం.

ఫోటోషూట్ల‌తో దుమారం:

రూహీ నిరంత‌ర ఫోటోషూట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ బ్యూటీ బోల్డ్ ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. బికినీలు, స్విమ్ సూట్ల‌లో నిరంత‌ర ట్రీట్ కొన‌సాగుతోంది. తాజాగా పాల నురుగు అందంతో క‌వ్విస్తున్న బికినీ షూట్ ఇంట‌ర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. రూహీ ఈ ఫోటోషూట్ లో టూ హా*గా ఉందంటూ యూత్ కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News