రుక్సార్ ధిల్లాన్.. దిల్ బ్లాస్ట్ అయ్యే గ్లామర్!
దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో వాలిపోతున్నారు
ప్రస్తుతం అందాల భామల హాట్ ఫోటోషూట్ లు చూడాలంటే వెంటనే ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం అందాల భామలు ఫోటో షూట్ లు చేసుకొని వాటిని ప్రొడక్షన్ హౌస్ లకి పంపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో వాలిపోతున్నారు.
గ్లామర్ బ్యూటీస్ కూడా తగ్గేది లే అనే విధంగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. లండన్ లో సెటిల్ అయ్యి ఇండియా వచ్చి మోడలింగ్ లో అడుగుపెట్టి హీరోయిన్ గా టర్న్ తీసుకున్న అందాల భామ రుక్సార్ ధిల్లాన్ కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరియర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ భామ ఆకతాయి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
తరువాత నేచురల్ స్టార్ నానికి జోడీగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది. తరువాత అల్లు శిరీష్ కి జోడీగా ఏబీసీడీ మూవీలో నటించింది. తెలుగులో చేసిన మూడు సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వలేదు. తరువాత హిందీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక మూవీలో నటించింది. నెక్స్ట్ విశ్వక్ సేన్ కి జోడీగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. అయితే మూవీలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు.
ప్రస్తుతం కొత్త హీరోతో స్పార్క్ అనే సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా మీదా రుక్సార్ ధిల్లాన్ భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఏ విధంగా కనిపించడానికైనా రెడీగా ఉంటుంది. అయితే తనని తాను షోకేస్ చేసుకునే స్థాయిలో క్యారెక్టర్స్ మాత్రం పడటం లేదు. సింపుల్ రోల్స్ మాత్రమే రుక్సార్ కి దొరుకుతున్నాయి.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది. తన ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్ లో కనిపించిన అందాలు నిండుగా కనిపించేలా ఫోజులు ఇస్తూ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే కచ్చితంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.