ఆ ఇద్దరు చేసిన తప్పు రుక్మిణి చేయకుండా ఉంటే బెటర్..!
ఈమధ్యనే తెలుగు తెరకు పరిచయమై మొదటి రెండు సినిమాలు సక్సెస్ అందుకుని ఆ తర్వాత డీలా పడిన కృతి శెట్టి, శ్రీలీల కెరీర్ లా రుక్మిణి కెరీర్ కాకూడదని చెబుతున్నారు.
కన్నడ నుంచి కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అంటే చాలు మన దర్శక నిర్మాతలంతా ఆమె వెంట క్యూ కడతారు. తెలుగు పరిశ్రమకు కన్నడ పరిశ్రమ నుంచి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. రీసెంట్ గా వచ్చిన రష్మిక మందన్న కూడా కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అఫ్కోర్స్ ఇప్పుడు అమ్మడి క్రేజ్ బాలీవుడ్ కి పాకిందనుకోండి. ఇక ఆమె దారిలోనే ఇప్పుడు రుక్మిణి వసంత్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.
కన్నడలో తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సినిమా హిట్ అందుకోవడంతో రుక్మిణి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అమ్మడికి ఇక్కడ కూడా పాపులారిటీ వచ్చింది. తెలుగులో కూడా రుక్మిణికి ఒకటి రెండు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజతో సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో మరో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే తెలుగు తెరకు పరిచయమై మొదటి రెండు సినిమాలు సక్సెస్ అందుకుని ఆ తర్వాత డీలా పడిన కృతి శెట్టి, శ్రీలీల కెరీర్ లా రుక్మిణి కెరీర్ కాకూడదని చెబుతున్నారు.
ఉప్పెనతో హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత అరడజను సినిమా చేయగా ఒకటి రెండు తప్ప అన్నీ ఫ్లాప్ అవ్వగా అమ్మడిని పక్కన పెట్టేశారు. ఇక మరోపక్క ధమాకా హిట్ తో అదరగొట్టిన శ్రీ లీల కూడా వరుస స్టార్ ఛాన్స్ లు అందుకోగా అమ్మడికి కూడా వరుస ఫ్లాపులు షాక్ ఇచ్చాయి. ఒక్క హిట్ పడగానే కథల గురించి పట్టించుకోకుండా వీరిద్దరు వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చారు.
ఇప్పుడు రుక్మిణికి కూడా సప్త సాగరాలుతో వచ్చిన పాపులారిటీతో వరుస ఆఫర్లు ఇస్తున్నారు. కానీ అమ్మడు కథల విషయంలో జాగ్రత్త పడితే బెటర్ అని అంటున్నారు. ఎలాగు ముందు వారి ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి కాబట్టి రుక్మిణి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తే ఆమె కెరీర్ కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంతేకాదు టాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి కదా అని కన్నడ పరిశ్రమని లైట్ తీసుకోకుండా అక్కడ కూడా సినిమాలు చేస్తే ఒకవేళ ఇక్కడ కెరీర్ రిస్క్ లో పడినా కనీసం అక్కడైనా ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. మరి రుక్మిణి వసంత్ సినిమాలను ఎలా ఓకే చేస్తుంది.. ఆమె తెలుగు ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే