అందాల భామకి ఇదే ఆఖరి అవకాశం..!

ఐతే కెరీర్ లో సరైన కథల ఎంపిక చేసుకోలేని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకున్న పరిస్థితికి అమ్మడి పడిపోయింది.

Update: 2025-02-19 04:03 GMT

అందం అభినయం ఉన్నా సినీ పరిశ్రమలో రాణించాలంటే కాస్తైనా లక్ ఉండాలి. అలాంటి అన్ లక్కీ భామలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక్క ఛాన్స్ మరొక్క ఛాన్స్ అనుకుంటూ కెరీర్ సాగించడం తప్ప సక్సెస్ మజాని ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. గ్లామర్ క్వీన్ గానే కాదు ప్రేక్షకులను అలరించే అభినయం తమ సొంతమైనా సరే సక్సెస్ లేకపోతే పక్కన పెట్టేస్తారు. ఇలాంటి లిస్ట్ టాలీవుడ్ లో చాలా పెద్దదే ఉండగా అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది రుక్సర్ థిల్లాన్. న్యాచురల్ స్టార్ నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించిన ఈ అమ్మడు యూత్ ఆడియన్స్ ని అలరించింది.


ఐతే కెరీర్ లో సరైన కథల ఎంపిక చేసుకోలేని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకున్న పరిస్థితికి అమ్మడి పడిపోయింది. అలాంటి అమ్మడికి ఒక సూపర్ హిట్ తర్వాత యువ హీరో సినిమా ఛాన్స్ వచ్చింది. అదే దిల్ రూబా.. క తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన ఈ సినిమాలో రుక్సర్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. లేటెస్ట్ గా ఒక రొమాంటిక్ సాంగ్ కూడా అలరించింది.

కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం లో హిట్ సినిమా కొట్టిన హీరో పక్కన ఛాన్స్ అందుకున్న రుక్సర్ థిల్లాన్ దిల్ రూబా తో కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా క తర్వాత సినిమా కాబట్టి కిరణ్ అబ్బవరం మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. ఈ సినిమా విషయంలో ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు. దిల్ రూబా సినిమాతో హిట్ పడితే మాత్రం రుక్సర్ కి లక్ తగిలినట్టే లెక్క.

చేయడానికి సినిమాలు చేసినా అందులో తన గురించి మాట్లాడుకునేలా చేయడంలో విఫలమైంది రుక్సర్. అందుకే ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. మరి ఆఖరి అవకాశంగా వచ్చిన ఈ దిల్ రూబా తో అయినా అమ్మడు సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమాలు లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ కి కిక్ ఎక్కించేస్తుంది అమ్మడు. సినిమా కూడా హిట్ పడితే కెరీర్ కాస్త సాఫీగా సాగే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News