స్టార్ సినిమా ఐటెం రచ్చ షురూ..!

తెలుగు తెర మీద మళ్లీ ఐటెం సాంగ్స్ హడావిడి ఉంటే ఆడియన్స్ కూడా అందుకు తగినట్టుగానే ఎంటర్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Update: 2024-10-26 02:45 GMT

ఒక సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించుకోవాలి అంటే ఆడియన్స్ ని అన్ని అంశాల్లో మెప్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని అలరించాలంటే సినిమాలో అది ఉంది ఇది లేదు అన్నట్టు కాకుండా అన్ని ఉండాల్సిందే. అలాంటి ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లో స్పెషల్ ఐటెం సాంగ్ అన్నది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒకప్పుడు స్టార్ సినిమాల్లో స్పెషల్ ఐటెం సాంగ్ కంపల్సరీ గా ఉండేది. సినిమా చివరి దశకు చేరుకుంది అనుకునే టైం లో హీరో క్లైమాక్స్ యాక్షన్ కి రెడీ అవుతున్నాడనే హింట్ ఇస్తూ ఐటెం సాంగ్ పెట్టే వారు.

ఈ ఐటెం సాంగ్ ప్లేస్ మెంట్ ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ కు మస్త్ జబర్దస్త్ అందాల విందుతో ఫుల్ జోష్ ఇచ్చేది. ఐతే ఈమధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఫ్లేవర్ మిస్ అవుతూ వచ్చింది. కావాలని చేయకపోయినా ఆడియన్స్ కి ఆ జోష్ మిస్ అవుతుందని చెప్పొచ్చు. కొందరు దర్శకులు ఇప్పటికీ తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పెడుతున్నా కూడా ఎక్కువ శాతం స్పెషల్ సాంగ్స్ కనిపించట్లేదని చెప్పొచ్చు.

ఐతే రాబోతున్న స్టార్ సినిమాల్లో ఈ స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ కొనసాగించబోతున్నాయని తెలుస్తుంది. పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 లో స్పెషల్ ఐటెం సాంగ్ ఉండబోతుంది. పుష్ప 1 లో సమంత ఉ అంటావా ఉ ఊ అంటావా అంటూ రచ్చ రచ్చ చేసింది. పుష్ప 2 లో దాన్ని మించి స్పెషల్ సాంగ్ ఉండాలని చూస్తున్నారు. మరోపక్క ప్రభాస్ రాజా సాబ్ లో కూడా ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతుందని టాక్.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో కూడా కథకు తగినట్టుగానే స్పెషల్ సాంగ్ ఒకటి అనుకుంటున్నారట. ఇలా రాబోయే సినిమాల్లో ఈ స్పెషల్ ఐటం సాంగ్స్ ట్రెండింగ్ లో ఉండనున్నాయి. కచ్చితంగా ఈ సాంగ్స్ హిట్ అయితే మళ్లీ తెలుగు తెర మీద ఐటెం సాంగ్స్ హంగామా షురూ అవుతుందని చెప్పొచ్చు. తెలుగు తెర మీద మళ్లీ ఐటెం సాంగ్స్ హడావిడి ఉంటే ఆడియన్స్ కూడా అందుకు తగినట్టుగానే ఎంటర్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News