రిపోర్ట్ పై అభ్యంతరం..మళ్లీ రీ షూట్!
ఈ నేపథ్యంలో అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 2 న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఈరిలీజ్ ని వాయిదా వేసారు.
గోద్రా రైలు దహనకాండ దేశవ్యాప్తంగా అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఎంతో మంది జీవితాల్ని మార్చేసిన గోద్రా రైలు ఘటన ఆధారంగా రజన్ చందేల్ `సబర్మతి రిప్టోర్ట్` టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 2 న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఈరిలీజ్ ని వాయిదా వేసారు. ఆగస్టు కి బధులు అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ సినిమాపై ఉన్న అభ్యంతరాలేనని తెలుస్తోంది. సినిమాలో కొన్ని అభ్యంతరక సన్నివేశాలు న్నాయట. అవి రాజకీయంగా దుమారం లేపడానికి అవకాశం ఉందంటున్నారు.
చిత్రీకరణ సమయంలో ఎలాంటి సందేహాలు లేకుండా షూట్ చేసినా ఔట్ ఫుట్ చూసుకున్నాక వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో ఆ సన్నివేశాల్ని తొలగించి..వాటిని మళ్లీ రీషూట్ చేయాలని అనుకుంటున్నారుట. అందుకు ఎలా లేదన్నా రెండు నెలలు సమయం పడుతుందని భావించి వాయిదా వేసినట్లు చిత్ర వర్గాల నుంచి తెలిసింది. దీంతో అభిమానులు ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.
సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి బజ్ తీసుకొచ్చాయి. ఇందులో విక్రాంత్ మాస్సే జర్నలిస్ట్ సమర్ కుమార్ పాత్రలో కనిపిస్తాడు. రాశీఖన్నా కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. హిట్ పడితే హిందీలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది. ఆమె ఆశని కూడా ఈ వాయిదా నిరుత్సాహ పరుస్తుంది.