బిగ్ బి పాదాలను తాకిన సచిన్- షారూఖ్
రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. డబ్బులకు కొదవా! అంటూ ముచ్చటించుకుంటున్నారు.
అంబానీ పెళ్లిలో వింతలు విడ్డూరాలు చర్చగా మారాయి. కొడుకు పెళ్లి కోసం అంబానీ ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేస్తుండడం వింతగా ఉందని పలువురు వాదిస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు అంతా అంబానీ పెళ్లికి విచ్చేసి రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ప్రదర్శనలు ఇస్తుండడం మరింత విచిత్రంగా కనిపిస్తోంది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. డబ్బులకు కొదవా! అంటూ ముచ్చటించుకుంటున్నారు.
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ శుక్రవారం రాత్రి వివాహం చేసుకోగా ఈ వేడుకకు ప్రపంచ కుభేరులు అటెండయ్యారు. చాలా మంది సినీరాజకీయ రంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఈ పెళ్లికి హాజరై నవ వధూవరులను ధీవించారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం కోసం అభిమానులు పోటీపడుతున్నారు. రజనీకాంత్‌ను కలిసిన తర్వాత బిగ్‌బి సచిన్‌ను కలిసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈ వీడియో లేదా ఫోటో వింతైనది కాదు. దీనిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బిగ్ బి అమితాబ్‌ని చూసిన వెంటనే ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ బచ్చన్ సచిన్ ని ఆపి, బదులుగా తన చేయి పట్టుకున్నారు. ఇంతలో అభిషేక్ బచ్చన్ కూడా అక్కడికి వచ్చారు. అతడు సచిన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బచ్చన్‌తో పాటు అతడి కుటుంబం మొత్తం కనిపించింది. బచ్చన్ మనవళ్లు నవ్య నంద, అగస్త్య నంద కూడా ఉన్నారు. సచిన్‌తో అగస్త్య కరచాలనం చేస్తున్నప్పుడు నవ్య కూడా `నమస్తే` అని పలకరించడం కనిపించింది. ముఖ్యంగా సచిన్ తనకంటే వయసులో పెద్ద అయిన అమితాబ్ కి పాద నమస్కారాలు చేయడం, దానికి అమితాబ్ అనునయించిన వీడియో ఇంటర్నెట్ లో హృదయాలను గెలుచుకుంది. అది వేగంగా వైరల్ గా మారింది. ఒక నెటిజన్ దీనిపై ఇలా వ్యాఖ్యానించారు, ``సచిన్ ని అభినందించిన విధానం హ్యాట్సాఫ్`` అని ఒకరు రాయగా.. క్రికెట్ దేవుడు.. నటన దేవుడు.. అని మరొకరు రాసారు.
మరొక వైరల్ వీడియోలో షారుఖ్ ఖాన్ కూడా అమితాబ్ బచ్చన్ -జయా బచ్చన్ పాదాలను తాకుతూ కనిపించారు. SRK కూడా జయా బచ్చన్ పాదాలను తాకడం, కౌగిలించుకోవడం చూపరులను ఆకర్షించింది. రజనీకాంత్, బిగ్ బి, సచిన్ టెండూల్కర్ పట్ల ఖాన్ చాలా గౌరవంగా ఉండటంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఫ్యామిలీతో కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందడం కనిపించింది. వీరే కాకుండా ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ వంటి పలువురు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.